Good News : ఏపీకి మరో 2 వేల కోట్లు, ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్…!
Good News : ఆంధ్రప్రదేశ్ లో ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అండగా నిలిచే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలోనే అదనపు రుణ సదుపాయం కోసం ఏపీ అడుగులు వేస్తుంది. ఇక కేంద్రం కూడా ఈ విషయంలో పెద్ద మనసుతో వ్యవహరిస్తూ రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తుంది.
ఆర్‌బీఐ వద్ద రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలం వేసి 2 వేల కోట్ల సమీకరించారు. 2 వేల కోట్లకు 7.13 శాతం వడ్డీతో బాండ్లు వేలం వేసింది ఏపీ ప్రభుత్వం. గత వారం సేకరించిన 2 వేల కోట్లను ఓడీ కింద ఆర్‌బిఐ జమ చేసుకుంది. ప్రస్తుతం మరో 2 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది.

Central govt good News for Ap
ఇటీవల అదనపు రుణపరిమితికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం అప్పులు చేయడం పట్ల విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసి అవినీతికి పాల్పడుతున్నారని అందుకే ఈ రేంజ్ లో అప్పులు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి.