KCR : కెసిఆర్ ఎంత దగ్గరికి వెళ్తున్నా.. కేంద్రం ఎందుకు పట్టించకోవడం లేదు.. కెసిఆర్ కు ఇక మూడినట్టేనా
KCR ఎప్పుడు కేసీఆర్ ఢిల్లీ వెళ్లారో.. అప్పుడే ఈ బైపోల్ పై ఈసీ ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బెంగాల్ తోపాటే జరుగుతుందనుకున్న బైపోల్ … జరగలేదు.. కేసీఆర్ హస్తిన పర్యటనకు వెళ్లారో లేదో .. వాయిదా అంటూ ప్రకటన వచ్చింది. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ ఢిల్లీకి వెళ్లగానే బైపోల్ షెడ్యూల్ ప్రకటన వచ్చేసింది. కేసీఆర్ హస్తినలో ఉన్నప్పుడే అకస్మాత్తుగా బైపోల్ నగారా మోగడం యాధృచ్చికమా? లేక.. అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గత నెలలో కేసీఆర్ వరుస ఢిల్లీ పర్యటనలతో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కేసీఆర్ రిక్వెస్ట్ మేరకే గత నెలలోనే రావాల్సిన ఎన్నికల షెడ్యూల్ రాలేదని అన్నారు. ఇప్పుడిక హుజురాబాద్ ఎలక్షన్ బెల్ మోగడంతో దీని వెనుక ఢిల్లీలో ఎలాంటి రాజకీయం నడిచిందనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది.
బెల్లు మోగడంపై కథనాలు షురూ KCR
కేసీఆర్ విజ్ఞప్తి మేరకే హుజురాబాద్ ఎన్నికను కొన్నివారాల పాటు వాయిదా వేసి.. దళితబంధు పథకం అమలుకు ఓ రూపు తీసుకొచ్చాకే ఎన్నికల నగారా మోగించారంటూ ఓ ఆసక్తికర కథనం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ లోగా దళితబంధుతో పాటు ఈటల హీట్ కాస్త తగ్గించడం, కుల సంఘాల మీటింగులు, జంపింగ్ జపాంగ్ ల షిఫ్టింగులు, తాయిలాలు, పందేరాలు గట్రా కంప్లీట్ చేసుకున్న గులాబీ పార్టీ ఇక ఇక్కడ ఓకే అనగానే.. అక్కడ ఎలక్షన్ బెల్ మోగిందని అంటున్నారు. అంతేగాక టీఆర్ఎస్-బీజేపీల ఉమ్మడి శత్రువైన కాంగ్రెస్‌ను భవిష్యత్తులో దెబ్బకొట్టేందుకు.. హుజురాబాద్ విషయంలో తాత్కాలికంగా కాంప్రమైజ్ కావాలని బీజేపీని కేసీఆర్ ఒప్పించారని అంటున్నారు. దీంతో ఢిల్లీ మంత్రాంగంలో పాపం ఈటల రాజేందర్ బలిపశువు అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
పట్టు బిగించిన కమలనాథులు KCR
ఇక మరో వాదన ప్రకారం
విసిరిన పాచికలు ఢిల్లీ పెద్దల దగ్గర బెడిసికొట్టాయని అంటున్నారు. కాలికి బలపం కట్టుకొని తిరిగినా.. కేంద్రం గులాబీ బాస్ ట్రాప్‌లో పడలేదని తెలుస్తోంది. తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న కమలనాథులు.. కేసీఆర్‌తో అంటకాగేందుకు ససేమిరా అన్నట్టు సమాచారం. ఈటల జేందర్‌లాంటి బలమైన నాయకుడు బీజేపీ తరఫున బరిలో ఉండడంతో ఎలాగైనా ఆయన్ను గెలిపించుకొని.. కేసీఆర్‌కు గట్టి ఝలక్ ఇవ్వాలని.. టీఆర్ఎస్‌కు బీజేపీనే ఆల్టర్‌నేట్ అనే మెసేజ్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. భారీ మెజార్టీతో ఈటల రాజేందర్ ను గెలిపించుకొని.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి.. కాషాయ జెండాను ఎగరేయాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. అందుకే, కమలదళాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు పెద్దగా కలిసిరాలేదని టాక్ వినిపిస్తోంది. అందుకే బైపోల్ నగారా మోగిందని చర్చ సాగుతోంది.