Chandrababu : మేము అధికారంలోకి వస్తే కక్ష సాధింపు కన్ఫర్మ్‌.. క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : మేము అధికారంలోకి వస్తే కక్ష సాధింపు కన్ఫర్మ్‌.. క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు

 Authored By prabhas | The Telugu News | Updated on :8 January 2022,5:40 pm

Chandrababu : ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గ పర్యటనలో ఆసక్తిక విషయాలను మాట్లాడాడు. వచ్చే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన బాబు పొత్తుల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఒక వేళ పొత్తులకు జనసేన మరియు బీజేపీలు సిద్దంగా ఉంటే తమకు ఇబ్బంది లేదు అన్నట్లుగా అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్‌ కు రోజులు దగ్గర పడ్డాయి అంటూ హెచ్చరించిన చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే కక్ష సాధింపు చర్యలు పక్కాగా ఉంటాయని హెచ్చరించాడు.

తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మరియు మద్దతుదారులకు సంబంధించిన పించన్లు మరియు సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారు. పేదలు అని కూడా చూడకుండా వారు తెలుగు దేశం పార్టీకి మద్దతుగా నిలిచినందుకు గాను వారిపై కక్ష సాధిస్తున్నారు. రాబోయే ఎన్నికల తర్వాత తెలుగు దేశం పార్టీ వస్తే అప్పుడు మా కక్ష సాధింపు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు వైకాపా వారికి పించన్లు ఉండవు అంటూ హెచ్చరించాడు. ఈ సమయంలో తెలుగు దేశం పార్టీకి చెందిన వారు ఓపికతో ఉండాలని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందరికి అండగా పార్టీ ఉంటుందని హామీ ఇచ్చాడు.ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రస్తుత పరిస్థితులు కొన్నాళ్లు మాత్రమే అన్నట్లుగా చంద్రబాబు నాయుడు అన్నాడు.

TDP chief N Chandrababu naidu about next elections

TDP chief N Chandrababu naidu about next elections

Chandrababu : ఏపీలో 2024 తర్వాత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం

మన రాజధాని మనది. అమరావతి రాజధానిగా తెలుగు దేశం పార్టీ పరిపాలన సాగించేందుకు గాను 2024 లో అధికారంలోకి వస్తాం అంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు. ప్రతి ఒక్క పార్టీ నాయకుడు మరియు కార్యకర్త కూడా ఈ రెండేళ్లు కష్టపడి పని చేయాలంటూ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశాడు. కష్టపడి పని చేసే ప్రతి ఒక్క కార్యకర్త కోసం అధిష్టానం మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చాడు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా పీడితులకు అందరికి కూడా న్యాయం చేస్తామంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ మరి అధికారంలోకి వచ్చి ఇవన్నీ చేసేనా అనేది చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది