YS Jagan : వైఎస్ జగన్ గొప్పతనం ఒప్పుకున్న చంద్రబాబు..!
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్.. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిజానికి.. ఇలాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు అనుకోలేదు. అది కేవలం సీఎం జగన్ వల్లనే సాధ్యం అయింది. సచివాలయ వ్యవస్థను చాలామంది హర్షిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అవగాహన లేని వారికి కూడా ఈ వ్యవస్థ.. ప్రభుత్వ పథకాల మీద అవగాహన కల్పించి లబ్ధిదారులకు ఫలాలు అందేలా చేస్తోంది. ఒక 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే.. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ అనేది ఏపీ ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తోంది.
ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్లో వాలంటీర్లకు ప్రజలో సత్సంబంధాలు ఉండటంతో.. ఎన్నికల సమయంలో ఇది ప్రతిపక్షాలకు సమస్యగా మారుతుందని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే.. సచివాలయ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి కూడా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే విన్నవించుకున్నాయి. అందుకే.. వలంటీర్లను ఈసీ దూరం పెట్టింది. అయితే.. వలంటీర్ల వ్యవస్థపై అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు పలు వ్యాఖ్యలు చేశారు. కానీ.. ఇప్పుడు దానిపై లేనిపోని వ్యాఖ్యలు చేయడం కంటే.. ఆ వ్యవస్థను తనవైపునకు తిప్పుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నారు.
YS Jagan : వలంటీర్లను తనవైపునకు తిప్పుకోవాలని చంద్రబాబు ప్లాన్స్
అందుకే.. వాలంటీర్లకు తమ ప్రభుత్వం రాగానే.. జీతాలు పెంచుతామని.. వాళ్లకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు ప్రకటించాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వాళ్లకు కేవలం రూ.5 వేలు మాత్రమే గౌరవ వేతనం కింద ఇస్తోంది. కానీ.. టీడీపీ అధికారంలోకి వస్తే రూ.10 వేలు చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వనున్నారట. ఒకవేళ ఈ విషయం జగన్ కు తెలిస్తే.. ఆయన ఊరుకుంటారా? నువ్వు 10 వేలు ఇచ్చేదేంటి.. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే.. రూ.12 వేలకు గౌరవ వేతనాన్ని పెంచుతాం అని ప్రకటించరా? అలా ప్రకటించడానికి ఒక్క సెకన్ చాలు అంటూ వైసీపీ నేతలు టీడీపీకి కౌంటర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా.. చంద్రబాబు కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్నట్టే కదా.