త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి.. సిద్ధంగా ఉండండి.. పిలుపునిచ్చిన చంద్రబాబు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి.. సిద్ధంగా ఉండండి.. పిలుపునిచ్చిన చంద్రబాబు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :10 December 2020,11:27 am

త్వరలో ఎన్నికలు రాబోతున్నాయా? ఏం ఎన్నికలు అని షాక్ కాకండి. మనం మాట్లాడుకునేది తిరుపతి ఉపఎన్నిక గురించి కూడా కాదు. సార్వత్రిక ఎన్నికల గురించే. అవి జరిగి ఏడాదిన్నర కూడా కాలేదు.. అప్పుడే సార్వత్రిక ఎన్నికలు ఏంది? అంటూ కంగారు అస్సలు పడకండి.. చంద్రబాబు అంతర్యం ఏంటో తెలుసుకుందాం పదండి..

త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి సిద్ధంగా ఉండండి పిలుపునిచ్చిన చంద్రబాబు

chandrababu alerting tdp leaders for coming elections

2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ.. జమిలి ఎన్నికల కోసం ఎంతో ప్రయత్నించారు. కానీ.. అప్పుడే మొదటి సారి అధికారంలోకి రావడంతో జమిలి ఎన్నికలు అంశాన్ని అప్పుడు పక్కన పెట్టారు మోదీ. కానీ.. 2019లో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడంతో.. ప్రస్తుతం కేంద్రం.. జమిలి ఎన్నికలపై దృష్టి పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతా ఓకే అయితే.. ఒకే దేశం.. ఒకే ఎన్నికలా.. ఐదేళ్లకు ఒకేసారి దేశమంతా ఎన్నికలను నిర్వహించే పద్ధతికి శ్రీకారం చుట్టునుంది కేంద్రం. జమిలి ఎన్నికలకు పునాది 2022లోనే పడుతుందని.. 2022లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని.. అందుకే కేడర్ అంతా సిద్ధంగా ఉండాలని, అలర్ట్ గా ఉండాలంటూ చంద్రబాబు టీడీపీ శ్రేణులకు చెబుతున్నారట.

ఏపీలో ఎంత త్వరగా ఎన్నికలు వస్తే.. చంద్రబాబుకు అంత బెటర్. తమ సత్తా చాటేందుకు టీడీపీకి మరో అవకాశం వస్తుంది కదా. 2014 లో బంపర్ మెజారిటీతో గెలిచిన చంద్రబాబు.. 2019లో బొక్కబోర్లా పడ్డారు. కేవలం 23 ఎమ్మెల్యేలే గెలిచారు. తన కొడుకు కూడా గెలవలేకపోయారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు కొంచెం డీలా పడ్డారు. కానీ.. వెంటనే తేరుకొని.. యాక్టివ్ అవుతున్నారు.

రోజూ జూమ్ మీటింగులు

ప్రస్తుతం వరుస మీటింగ్ లు పెడుతున్నారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని వీడియో కాన్ఫరెన్సుల ద్వారా చంద్రబాబు… పార్టీ నాయకులతో రోజూ మాట్లాడుతున్నారు. నేతలకు ధైర్యం చెబుతున్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని.. క్షేత్ర స్థాయిలో నేతలంతా అలర్ట్ గా ఉండాలని.. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలి… ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని.. ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత వచ్చేలా ప్రజల్లోకి వెళ్లాలంటూ హితభోద చేస్తున్నారు.

చంద్రబాబు.. ఇంత సీరియస్ గా జమిలి ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారంటే.. మోదీ అంతరంగం తెలుసుకున్నారా? లేదా మోదీ ఎలాగైనా ఈసారి జమిలి ఎన్నికలను 2022లో నిర్వహిస్తారని చంద్రబాబుకు ముందే తెలిసిందా? అని టీడీపీ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది