ChandraBabu : ఒక్క చాన్స్ అంటున్న జనసేన.. రెండో చాన్స్ అంటున్న వైసీపీ.. చివరి చాన్స్ అంటున్న చంద్రబాబు
ChandraBabu : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నాయి. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీల నేతలంతా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. మాకు ఇంకో చాన్స్ ఇవ్వండి అంటూ బతిమిలాడుకుంటున్నారు. కొందరు నేతలు అయితే ప్రజల వద్ద ఎమోషనల్ అవుతున్నారు. సానుభూతి కోసం ట్రై చేస్తున్నారు. ఎవరికి తోచిన వ్యూహాలను వాళ్లు రచిస్తున్నారు. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా పోటీ పడేది మాత్రం మూడు పార్టీలు మాత్రమే.
అవే టీడీపీ, వైసీపీ, జనసేన. ఈ మూడు పార్టీలదే ఇప్పుడు హవా. ఎలాగూ వైసీపీ ఒకసారి అధికారంలోకి వచ్చింది. కాబట్టి మాకు రెండో చాన్స్ ఇవ్వండి అంటూ జనాల్లోకి వెళ్తోంది. ఇక.. జనసేన పార్టీ మాత్రం మాకు ఒక్కసారి అయినా చాన్స్ ఇవ్వండి అంటోంది. ఇక.. చంద్రబాబు మాత్రం చివరి చాన్స్ ఇవ్వండి. చాన్స్ ఇస్తే ఓకే లేదంటే ఇక ఇవే నాకు చివరి ఎన్నికలు అంటూ చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రజలకు ఇప్పుడు మూడు ఛాన్సులు ఉన్నాయి. ఒక చాన్స్ ఏమో.. జనసేన పార్టీని గెలిపించడం. రెండో చాన్స్ వైసీపీని గెలిపించడం.. మూడో చాన్స్ చంద్రబాబును గెలిపించడం.
ChandraBabu : ఏపీ ప్రజల చాయిస్ ఏంటో మరి?
వాళ్ల చేతుల్లో మూడు చాన్స్ లు ఉన్నాయి. మరి.. ఏ చాన్స్ ను సెలెక్ట్ చేసుకుంటారు అనేది వాళ్లకే తెలియాలి. నాకు ఒక్క చాన్స్ ఇస్తే ఈ రాష్ట్రాన్నే మార్చేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ చాలా రోజుల నుంచి చెబుతున్నారు. అందుకని.. పవన్ కు ఒక చాన్స్ ఇస్తారా? లేక రెండో చాన్స్ ఇస్తే ఇంకా ప్రవేశపెట్టాల్సిన ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడానికి వీలు అవుతుంది అంటూ సీఎం జగన్ చెప్పడం.. ఇక నాకు చివరి చాన్స్ ఇవ్వండి.. లేదంటే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా అంటూ చంద్రబాబు చెప్పడం.. మరి ఈ ముగ్గురు నేతల్లో ఎవరిని ప్రజలు నమ్మబోతున్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.