ఈ ప్లాన్ కనుక వర్కవుట్ అయితే నెక్స్ ట్ సీఎం చంద్రబాబే? నో డౌట్?
మనం కూడా చాలాసార్లు ఏదైనా పని చేయాలంటే కొన్ని ప్లాన్లు వేసుకుంటాం. ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బీ.. అనుకుంటాం. రాజకీయ నాయకులు కూడా ఏ పని చేయాలన్నా రెండు మూడు ప్లాన్లు వేసుకుంటారు. ఒకటి ఫెయిల్ అయినా మరొకటి అమలు చేస్తారు.
ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే.. 2019 ఎన్నికల ముందు బీజేపీ పార్టీని దూరం చేసుకున్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. కానీ.. అదే బెడిసికొట్టింది. తర్వాత 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం.. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం ఒకేసారి జరిగిపోయాయి. దీంతో తన తప్పు తెలుసుకొని.. ఇప్పటికీ కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు.
కానీ.. బీజేపీ ఏమన్నా తక్కువ తిన్నదా? చంద్రబాబును పక్కన పెట్టి.. వైసీపీని చేరదీసింది. దీంతో చంద్రబాబు పుండుమీద కారం చల్లినట్టయింది. అంతేనా.. ఏపీలో పాగా వేయడానికి బీజేపీ సమాయత్తమవుతోంది. ఇంకా.. టీడీపీ నేతలను బీజేపీలోకి లాక్కుంటోంది. దీంతో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఓవైపు జమిలి ఎన్నికలు వస్తాయి.. మళ్లీ నాదే అధికారం అంటూ ఏదేదో మాట్లాడుతున్న చంద్రబాబుకు నిజంగా ముందు వెళ్లే దారి కనిపించడం లేదు. అందుకే చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. బీజేపీతో దోస్తీ చేయాలని ఎంతో ట్రై చేసినా ఆ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో చంద్రబాబు ప్లాన్ బీ వైపునకు మళ్లారట. ఇంతకీ ప్లాన్ బీ ఏంటి అనే కదా.
చంద్రబాబు ప్లాన్ బీ ఏంటంటే?
చంద్రబాబు ప్లాన్ బీ ఏంటంటే.. వైసీపీకి, బీజేపీకి మధ్య వైరం పెట్టడం. వైసీపీకి.. బీజేపీకి వైరం పెడితే.. చంద్రబాబుకు వచ్చే లాభం ఏంటి.. అంటారా? వైసీపీ, బీజేపీ కొట్టుకునేలా చేసి జనసేనను బీజేపీ నుంచి దూరం చేయాలి. బీజేపీ నుంచి జనసేన దూరం అవ్వడంతో పాటు.. వైఎస్సార్సీపీకి, బీజేపీకి పడకుండా చేస్తే మధ్యలో వచ్చిన జనసేనకు, వైసీపీ మధ్య గొడవలు వస్తాయని.. అలా మూడు పార్టీలను ఒకవైపునకు తిప్పి.. చివరకు జనసేనను తనవైపునకు తిప్పుకోవడం కోసం చంద్రబాబు ప్లాన్లు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
2019లో చంద్రబాబు పొత్తుల జోలికి పోలేదు. అదే బెడిసికొట్టింది. మళ్లీ ఎటువంటి పొత్తులు లేకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఇప్పుడు ఉన్న సీట్లు కూడా దక్కవు అని అనుకొని.. ప్లాన్ బీని అమలు చేయడానికి చంద్రబాబు సంసిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి.. చంద్రబాబు ప్లాన్ బీ ఏమేరకు వర్కవుట్ అవుతుందో?