Chandrababu : చంద్రబాబు గారు కాస్త బుర్ర పెట్టి ఆలోచించి ప్రభుత్వంపై విమర్శలు చేయండి
Chandrababu : రేపల్లి రైల్వే స్టేషన్ లో అత్యాచార సంఘటనపై ఇప్పటికే రాష్ట్ర పోలీసులు తీవ్రంగా శ్రమించి నిందితులను పట్టుకున్నారు. బాధిత మహిళ కు పూర్తి సహాయ సహకారం అందిస్తాం అంటూ మంత్రులు మరియు ప్రభుత్వ వర్గాల వారు ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం అంటూ రాష్ట్ర హోం మంత్రి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ఈ విషాద సంఘటన ను రాజకీయం చేసేందుకు తెలుగు దేశం పార్టీ నాయకులు సాధ్యం అయినంతగా డ్రామాను సృష్టిస్తూ హడావుడి చేస్తున్నారు అనిపిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం సంఘటన విషయంలో జరుపుతున్న విచారణకు అడ్డు తగలడం మాత్రమే కాకుండా రాష్ట్ర పోలీసు వ్యవస్థను అవమానించే విధంగా తెలుగు దేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. రైల్వే స్టేషన్ లో దళిత మహిళ పై అత్యాచారం జరిగిన సమయంలో బాధితురాలి భర్త రైల్వే పోలీసుల వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవట. ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా తెలియజేశారు. పోలీసుల వద్దకు మళ్లీ మళ్లీ వెళ్లినా కూడా పట్టించుకోక పోవడం దారునం అంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు.
రైల్వే పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్ర పోలీసు వ్యవస్థను తప్పుబట్టడం ఏంటో ఆయనకే అర్థం కావాలి. రైల్వే స్టేషన్ లో జరిగిన నేరానికి పూర్తి బాధ్యత రైల్వే పోలీసు వ్యవస్థ చూసుకుంటుంది. కాని రాష్ట్ర పోలీసులు బాధ్యతతో నిందితులను అతి తక్కువ సమయంలోనే పట్టుకుని వారికి శిక్ష పడేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో రాష్ట్ర పోలీసులను చంద్రబాబు నాయుడు బుర్ర లేకుండా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటూ వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారంగా విమర్శలు చేయడం మానేసి కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి బాబు గారు అంటూ వైకాపా నాయకులు సూచిస్తున్నారు.