Home » Andhra Pradesh » Chandrababu Naidu Viral Comments In Kuppam Tour
andhra pradesh

ChandraBabu : తప్పు చేశానంటూ ఒప్పుకున్న చంద్రబాబు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 14, 2022 12:44 am
Advertisement

ChandraBabu : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సొంత నియోజక వర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఆయన బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కుప్పం ప్రజలతో మాట్లాడాడు. ఆ సందర్బంగా తన తప్పును తెలుసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తాను ఇన్నాళ్లు చేసిన తప్పులను తెలుసుకుని ఇక ముందు అలాంటి తప్పులు జరుగకుండా చూసుకుంటాను అన్నట్లుగా కుప్పం ప్రజలకు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు హామీ ఇచ్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు దేశం పార్టీ నాయకులు ఈ విషయమై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కుప్పం ప్రజలు నన్ను ఏడు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. నన్ను మీ ముద్దు బిడ్డగా చూసుకున్నారు. కాని నేను మాత్రం తప్పు చేశాను. ఇప్పటి వరకు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు. త్వరలో ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉంటూ మీ సేవలో తరిస్తాను. మొన్నటి ఎన్నికలకు పూర్తి బాధ్యత నాదే. తప్పు నా వైపు ఉండటం వల్ల తలదించుకుంటున్నాను. నా తప్పులన్నింటిని కూడా సరి దిద్దుకుంటాను అన్నట్లుగా కుప్పం ప్రజలతో పాటు తెలుగు దేశం పార్టీ నాయకులకు కూడా హామీ ఇచ్చాడు.

chandrababu naidu viral comments in kuppam tour

Advertisement

ఇక బాదుడే బాదుడు కార్యక్రమంకు ఆశించిన స్తాయిలో ఆధరణ రావడం లేదు. కుప్పంలో పార్టీ నాయకులు క్రియాశీలకంగా వ్యవహరించడంతో జనాలు భారీ ఎత్తున తరలి రాలేదు. పైగా కార్యక్రమం పై పార్టీ నాయకుల్లో కూడా ఆసక్తి ఉన్నట్లుగా కనిపించడం లేదు. తెలుగు దేశం పార్టీ అధినేత సొంత నియోజక వర్గంలో ఇలాంటి పరిస్థితి కనిపించడం గతంలో ఎప్పుడు లేదు. తెలుగు దేశం పార్టీకి పదే పదే ఇలాంటి అవమానాలు ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఈ పరిణామాలు 2024 ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి