Chittoor.. గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చంద్రబాబు
వైఎస్‌ఆర్ వర్ధంతికి వర్తించని కొవిడ్ నిబంధనలు గణేశ్ ఉత్సవాలకు ఎలా వర్తిస్తాయని ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లాలో ఉన్న ఆయన గణేశ్ ఉత్సవాలకు ఏపీ సర్కారు ఆంక్షలు విధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేశ్ చతుర్థి ఉత్సవాలను తెలంగాణలో అక్కడి సర్కారు అనుమతించినప్పుడు ఇక్కడి ఏపీ సర్కారు ఎందుకు అనుమతించదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఈ విషయమై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

Chandrababu shock to yanamala ramakrishnudu
వైసీపీ ప్రభుత్వం గణేశ్ ఉత్సవాలకు ఆంక్షలు పెట్టడం సరికాదని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు. ఇకపోతే వైసీపీ నేతలు, మంత్రులు మాత్రం కేంద్రం విడుదల చేసిన గైడ్‌లైన్స్ ప్రకారమే జగన్ సర్కారు గణేశ్ చతుర్థి ఉత్సవాలపై ఆంక్షలు విధించిందని పేర్కొంటున్నారు. కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచిన నేపథ్యంలోనే గణేశ్ ఉత్సవాలకు ఆంక్షలు ఉంటాయని, కేంద్రం పేర్కొన్న గైడ్‌లైన్స్ ప్రకారమే రాష్ట్రం నడుచుకుంటున్నదని వైసీపీ నేతలు అంటున్నారు. బీజేపీ నేతలు సైతం వైసీపీ ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించడాన్ని తప్పుబడుతున్నారు.