Chandrababu : ఆ రెండు నియోజకవర్గాల్లో ఎంఎల్‌ఏ గా చంద్రబాబు పోటీ?
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలపై అప్పుడే దృష్టి పెట్టారు. నిజానికి ఎన్నికలకు ఇంకా అటూ ఇటుగా రెండేళ్ల సమయం ఉంది కానీ.. ఇప్పటి నుంచే చంద్రబాబు తన దృష్టిని కేంద్రీకరించారు. ఇప్పటికే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ను కన్ఫమ్ చేశారు. అయితే.. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో చంద్రబాబు కొంచెం డీలా పడిపోయారు. టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో చంద్రబాబుకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏపీ సీఎం జగన్ కూడా పలు పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.
చివరకు తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ జగన్ ఎలాగైనా చంద్రబాబును ఓడించాలని పట్టుపట్టారు. ఈనేపథ్యంలో టీడీపీ భవిష్యత్తుపై చంద్రబాబు కాస్త కంగారు పడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే ఇక టీడీపీ పరిస్థితి అంతే.. చంద్రబాబు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే ఇక. అందుకే.. చంద్రబాబు కూడా జగన్ ను ఎదుర్కొనేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే కుప్పం, గుంటూరు 2, పెదకూరపాడు
Chandrababu : రెండు చోట్ల పోటీ చేస్తున్న చంద్రబాబు
ఈ మూడు నియోజకవర్గాల్లో ఏవో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎలాగైనా చంద్రబాబును ఓడించాలని జగన్ పలు వ్యూహాలను రచిస్తున్న విషయం తెలిసిందే. అందుకే.. టీడీపీని బతికించడం కోసం చంద్రబాబు కూడా పలు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే రెండు చోట్ల పోటీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారట. కుప్పంలో ఒకవేళ చంద్రబాబును ఓడించినా.. వేరే నియోజకవర్గంలో గెలిచే చాన్స్ ఉంటుంది కాబట్టి.. చంద్రబాబు అందుకే రెండు నియోజకవర్గాలపై దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది.