చంద్రబాబు రామతీర్ధం రావడం వల్ల జగన్ హీరో అయ్యాడు.. ఎందుకో చూడండి
ఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ దాడులే ఏపీలో హాట్ టాపిక్. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. తాజాగా కూడా మరో దాడి జరిగింది. ఇలా రోజూ ఏదో ఒక దేవాలయంపై దాడి జరగడం నిజంగా అమానుషం. దీని వెనుక ఎవరున్నా ఖచ్చితంగా వాళ్లకు శిక్ష పడాల్సిందే.
అయితే.. చాలా దేవాలయాలపై దాడి జరిగినా.. విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఉన్న రాముల వారి గుడిలో జరిగిన దాడి సర్వత్రా సంచలనం సృష్టించింది.
రాముడి విగ్రహం తల, మొండాన్ని వేరు చేసి కొలనులో రాముడి తలను పడేసి వెళ్లిపోయారు దుండగులు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. ఇలా.. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టి ఏం సాధిస్తారు.. అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంపైనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ప్రభుత్వాన్నే నిందిస్తున్నారు. ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు చంద్రబాబు. అందరూ జగన్ వైపు వేలు చూపిస్తుండటంతో.. దీన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు వెంటనే రామతీర్థం పర్యటన చేశారు.
అక్కడికి వెళ్లి.. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. జగన్.. రావణుడు అంటూ తెగ తిట్టేశారు. చంద్రబాబు పర్యటన ఆధ్యంతం హడావుడిగా సాగింది. బాబు వస్తున్నారని తెలిసి టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో రామతీర్థానికి చేరుకున్నారు.
కానీ.. చంద్రబాబు అక్కడికి వెళ్లి చేసిందేమీ లేదు కానీ.. తెగ హడావుడి మాత్రం చేశారు. అది జగన్ కే ప్లస్ అయింది. ఏపీ ప్రభుత్వమే ఈ దాడులు చేయిస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా అది నిజం కాదు కదా. పోనీ.. వాళ్ల దగ్గర ఆధారాలు ఉన్నాయా? అంటే లేవు.
అసలు.. ఇదంతా చేయిస్తున్నదెవరు.. అనేది తేలితేనే ఈ దాడులకు పుల్ స్టాప్ పడుతుంది. లేదంటే రోజుకో దాడి ఇలాగే జరుగుతూనే ఉంటుంది.