ChatGPt | చాట్‌జీపీటీలో స్నేహితుడిని ఎలా చంపాలనే ప్రశ్న.. 13 ఏళ్ల బాలుడు అరెస్ట్
Chat GPt | ఫ్లోరిడాలోని డెలాండ్ పట్టణంలో 13 ఏళ్ల ఒక మిడిల్ స్కూల్ విద్యార్థి తన స్నేహితుడిని ఎలా చంపాలన్న ఉద్దేశంతో AI చాట్‌బాట్ ChatGPTకి ప్రశ్న వేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో బాలుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.ఈ ఘటన డెలాండ్‌లోని సౌత్‌వెస్టర్న్ మిడిల్ స్కూల్‌లో చోటు చేసుకుంది. ఆ స్కూల్ ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తూ విద్యార్థి ChatGPTలో “How to kill my friend in the middle of class?”అనే ప్రశ్నను టైప్ చేశాడు.
#image_title
చిన్న వయస్సులో ఇలా ఎలా..
దీన్ని Gaggle అనే AI మానిటరింగ్ సిస్టమ్ గుర్తించి వెంటనే స్కూల్ రిసోర్స్ డెప్యూటీకి అలర్ట్ చేసింది. ఇది స్కూల్ విద్యార్థుల ఆన్‌లైన్ యాక్టివిటీపై నిఘా ఉంచే వ్యవస్థ.అలర్ట్ అందుకున్న అధికారులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించగా, వారు స్కూల్‌కు చేరుకుని విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రాథమిక విచారణలో బాలుడు.. “నా ఫ్రెండ్ నన్ను ఎగతాళి చేస్తుంటాడు, అందుకే అతన్ని ట్రోల్ చేయాలనుకున్నాను. నిజంగా ఏమీ చేయాలన్న ఉద్దేశం లేదు” అని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. 2018లో ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్ స్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో, ప్రమాద సూచనలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు.