ChatGPT : ఖరీదైన కెమెరాలు అవసరం లేదు.. చాట్ జీపీటీతో క్వాలిటీ పోర్ట్రెయిట్స్ ఇలా ఈజీగా మార్చుకోండి
ప్రధానాంశాలు:
ChatGPT : ఖరీదైన కెమెరాలు అవసరం లేదు.. చాట్ జీపీటీతో క్వాలిటీ పోర్ట్రెయిట్స్ ఇలా ఈజీగా మార్చుకోండి
ChatGPT : మీ ఫోటోల కోసం ఖరీదైన కెమెరాలు, ప్రొఫెషనల్ లైటింగ్ సెటప్‌లు అవసరం ఉండదు. ChatGPT ఇమేజ్ జనరేషన్ టూల్ సహాయంతో, కేవలం ఒక డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా మీరు స్టూడియో స్థాయి పోర్ట్రెయిట్‌లను తీసుకోవచ్చు ChatGPT ఇప్పుడు కేవలం చిత్రం గీయడం మాత్రమే కాదు.కెమెరా యాంగిల్స్, లైటింగ్, లెన్స్ ఎఫెక్ట్స్, మరియు ఆర్టిస్టిక్ స్టైల్‌లను కూడా అర్థం చేసుకోగలదు.
ChatGPT : ఖరీదైన కెమెరాలు అవసరం లేదు.. చాట్ జీపీటీతో క్వాలిటీ పోర్ట్రెయిట్స్ ఇలా ఈజీగా మార్చుకోండి
ChatGPT : ఇలా చేయండి..
మీరు అడిగినట్లుగా, ఇది ఇప్పుడు స్టూడియో లెవెల్ లైటింగ్, సినిమా లెన్స్ టచ్, కృతిమ వర్షపు నీటి బిందువులు, పొగమంచు వంటి మైక్రో డీటెయిల్స్‌ను కూడా పసిగట్టి ఇమేజ్‌లో ప్రతిబింబించగలదు. మీరు ఇచ్చే ఇంగ్లీష్ ప్రాంప్ట్ ఆధారంగానే ఫలితం రూపొందుతుంది. దీని వల్ల AIకి మీరు కోరుతున్న ఫీచర్లు, భావ వ్యక్తీకరణలు, కెమెరా స్టైల్ మొదలైనవి స్పష్టంగా అర్థమవుతాయి.
మీరు చేయాల్సిందల్లా ChatGPTకి లాగిన్ అవ్వండి.మీ సాధారణ ఫోటోను అప్‌లోడ్ చేయండి.మీకు కావాల్సిన స్టైల్ ప్రకారం డీటెయిల్డ్ ఇంగ్లీష్ ప్రాంప్ట్‌ను ఎంటర్ చేయండి. AI మేజిక్‌ను ఆస్వాదించండి. ఇకపై స్టూడియో అవసరం లేదు. మీ సొంత డిజిటల్ ఆర్ట్ స్టూడియోను మీ బ్రౌజర్‌లోనే కలిగి ఉంటారు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు.