SIM Card : మీ పేరుతో ఎవరైనా సిమ్ తీసున్నారా? మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోండిలా?
SIM Card : ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉంటుంది. మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు సిమ్ కార్డు తీసుకోవాల్సిందే. అది ఏ నెట్ వర్క్ అయినా సరే… సిమ్ కార్డు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రూఫ్ చూపించాలి. అది ఆధార్ కార్డు కావచ్చు.. ఇంకేదైనా కావచ్చు. అయితే… ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి కదా. సైబర్ నేరగాళ్లు… వేరే వాళ్ల ప్రూఫ్ లతో సిమ్ లను తీసుకొని నేరాలకు ఆ సిమ్ లను ఉపయోగించుకుంటున్నారు. రోజూ పేపర్లలో, న్యూస్ చానెళ్లలో ఇటువంటి వార్తలు ఎన్నో చూస్తున్నాం. కానీ.. మనకు తెలియకుండా మన అడ్రస్ ప్రూఫ్ తో సిమ్ కార్డును ఎవరైనా కొనుగోలు చేస్తే… దాన్ని మనం తెలుసుకోవడం ఎలా? అనే విషయం చాలామందికి తెలియదు.
అందుకే… మనకు తెలియకుండా… మన అడ్రస్ ప్రూఫ్స్ తో ఎవరైనా సిమ్ కార్డు తీసుకున్నా… అసలు మన అడ్రస్ ప్రూఫ్ మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలన్నా… ఇప్పుడు అది చాలా ఈజీ. మీరు వాడని నెంబర్లు ఏవైనా ఉన్నా.. వేరే నెంబర్లు అంటే మీరు వాడని నెంబర్లు మీ ప్రూఫ్ మీద తీసుకొని ఉన్నా.. మీరు వెంటనే ఆ నెంబర్ ను బ్లాక్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
SIM Card : ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు
దాని కోసం… ఒక వెబ్ సైట్ ఉంటుంది. ఆ వెబ్ సైట్ లోకి వెళ్లి… ప్రస్తుతం మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. అప్పుడు ఆ మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశాక… ఆ మొబైల్ నెంబర్ ఎవరి పేరు మీద అయితే ఉందో… ఆ పేరు మీద ఉన్న మిగితా ఫోన్ నెంబర్ల వివరాలన్నీ వస్తాయి. ఒకవేళ.. మీరు ఆయా ఫోన్ నెంబర్లలో ఏదైనా వాడనిది ఉంటే… అక్కడికక్కడే బ్లాక్ చేయొచ్చు.
https://tafcop.dgtelecom.gov.in/ అనే వెబ్ సైట్ కు వెళ్లి మీరు మీ పేరు మీద ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ ను విజయవాడకు చెందిన టెలికాం విభాగం వాళ్లు రూపొందించారు.