Health Tips : మార్నింగ్ లేవగానే ఫోన్ చూస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే..
Health Tips : ప్రస్తుత యుగంలో మొబైల్ ఫోన్ అనేది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రస్తుతం మొబైల్ లేని మనిషి లేడంటే నమ్మడం కష్టమే.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మొబైల్‌ను వాడుతూనే ఉంటాం. కొందరైతే గంటల తరబడి దానిలోనే మునిగిపోతారు. చాలా మందికి ఇదొక వ్యసనంగా మారింది. ఇక సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్సప్, ఫేస్ బుక్, ఈ మెయిల్ వంటి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉంటారు. కొందరైతే లేవగానే ఫోన్‌లోనే మునిగిపోతారు. లేవగానే ఫోన్ చూడకుంటే వారికి డే స్టార్ట్ అవ్వదు.
చిన్నా, పెద్దా ఇలా వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గంటల తరబడి ఫోన్‌లో లీనమైపోతారు. ఇలా ఉదయం లేవగానే ఫోన్ చూడటం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.. ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల అనే వ్యాధుల బారిన పడే చాన్స్ ఉందని చెబుతున్నారు.దాదాపుగా 61 శాతం మంది ప్రజలు.. నిద్రపోయే సమయంలో లేదా నిద్ర లేచిన వెంటనే కొద్ది సేపు ఫోన్ తో గడిపేస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఫోన్ లోని ఎల్‌ఈడీ కాంతి ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది నీలం కాంతిని కలిగి ఉంటుంది. ఇది డైరెక్ట్ గా బాడీలోకి ప్రవేశిస్తుంది.
Health Tips : అనేక రోగాల బారిన పడే ఛాన్స్
దీని వల్ల బాడీకి అనేక అసౌకర్యాలు కలుగుతాయట. రాత్రి పడుకునే ముందు ఫోన్ చూడటం వల్ల త్వరగా నిద్రపట్టదు. ఉదయం లేవగానే ఫోన్ చూడటం వల్ల మానసిక క్షోభ కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు ఆందోళన, నిద్రలేమి, బాడీ పెయిన్స్ వంటివి ఎక్కువ అవుతాయని చెబుతున్నారు. అందుకే నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత ఫోన్ చూసే అలవాటును మానుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూడటం వల్ల అధిక రక్తపోటు వేధిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. మరి మీకు సైతం ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవడం ఉత్తమం.