
Chicken : చికెన్ తినే వారు జర జాగ్రత్త... ఆ కోళ్లు లక్షల్లో మృతి
Chicken : మనుషులకే కాదు ఇప్పుడు పలు మూగ జీవాలకి కూడా అంతు చిక్కని వైరస్‌లు వేధిస్తున్నాయి. కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్ పశ్చిమగోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారుజామున చనిపోతుండడం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. పందేలు కోసం ప్రత్యేకంగా పెంచిన కోళ్లు కూడా వైరస్ బారిన పడి మరణించాయి, దీంతో కోళ్ల పెంపకందారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు.ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అందులోనూ పందేలు కోసం పెంచిన కోళ్లు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నాయి. దీంతో చికెన్ తినే వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చికెన్ తినడం వల్ల మనుషులు కూడా చనిపోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Chicken : చికెన్ తినే వారు జర జాగ్రత్త… ఆ కోళ్లు లక్షల్లో మృతి
అయితే ఇదే వైరస్ నాలుగేళ్ల క్రితం కూడా ప్రభావితం చూపిందని పౌల్ట్రీ యజమానులు పేర్కొంటున్నారు. అప్పట్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో మార్కెట్‌లో అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. వైరస్ తగ్గుముఖం పట్టడానికి చాలా రోజులు పట్టింది. ఇప్పుడు మరోసారి వైరస్ విజృంభిస్తుండడంతో చికెన్ ప్రియులతోపాటు, పౌల్ట్రీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్ సోనిన కోడిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించకపోవం కూడా కోళ్లు పెద్ద సంఖ్యలో మృతికి కారణమంటున్నారు. అప్పట్లో కూడా భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ యజమానులు చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా ఏళ్ల తర్వాత వైరస్ తగ్గింది. ఇంతలో చాలా నష్టాలు చవి చూశారట. మరోసారి ఇప్పుడు ఈ వైరస్ రావడంతో పౌల్ట్రీ యజమానులతో పాటు చికెన్ ప్రేమికులు కూడా ఆందోళన చెందుతున్నారు.
గుండె చుట్టూ నీరు చేరి గుండెపోటుతో కోడి మరణిస్తుంది. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ, వైరస్ సోకిన కోళ్లకు అది పని చేయడం లేదు. మృత్యువాత చెందిన కోళ్లను రహదారుల పక్కన సంచుల్లో వేయడం వల్ల వైరస్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైరస్ సోకిన కోడి వల్ల సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర కోళ్లకు కూడా వైరస్ సోకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కోళ్ల మధ్య వేగంగా వ్యాపించే ఈ వైరస్ కారణంగా కొన్ని గంటల్లోనే పెంపక కేంద్రాల్లోని అన్ని కోళ్లు చనిపోతున్నాయి. కోళ్ల కళేబరాలను 3 అడుగుల లోతైన గోతిలో పూడ్చి, సున్నం వేసి నశింపజేయాలని, లేదా కాల్చేయాలని సూచిస్తున్నారు. ఈ విధంగా చేస్తే వైరస్ వ్యాప్తి నుంచి మిగిలిన కోళ్లను రక్షించవచ్చు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.