Chicken : చికెన్ తినే వారు జ‌ర జాగ్ర‌త్త‌… ఆ కోళ్లు ల‌క్ష‌ల్లో మృతి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chicken : చికెన్ తినే వారు జ‌ర జాగ్ర‌త్త‌… ఆ కోళ్లు ల‌క్ష‌ల్లో మృతి

 Authored By ramu | The Telugu News | Updated on :23 January 2025,7:00 am

Chicken : మ‌నుషుల‌కే కాదు ఇప్పుడు ప‌లు మూగ జీవాల‌కి కూడా అంతు చిక్క‌ని వైర‌స్‌లు వేధిస్తున్నాయి. కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్‌ పశ్చిమగోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారుజామున చనిపోతుండ‌డం చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. పందేలు కోసం ప్రత్యేకంగా పెంచిన కోళ్లు కూడా వైరస్‌ బారిన పడి మరణించాయి, దీంతో కోళ్ల పెంపకందారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు.ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అందులోనూ పందేలు కోసం పెంచిన కోళ్లు ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నాయి. దీంతో చికెన్ తినే వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చికెన్ తినడం వల్ల మనుషులు కూడా చనిపోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Chicken చికెన్ తినే వారు జ‌ర జాగ్ర‌త్త‌ ఆ కోళ్లు ల‌క్ష‌ల్లో మృతి

Chicken : చికెన్ తినే వారు జ‌ర జాగ్ర‌త్త‌… ఆ కోళ్లు ల‌క్ష‌ల్లో మృతి

Chicken వైరస్ ఎఫెక్ట్..

అయితే ఇదే వైరస్‌ నాలుగేళ్ల క్రితం కూడా ప్రభావితం చూపిందని పౌల్ట్రీ యజమానులు పేర్కొంటున్నారు. అప్పట్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో మార్కెట్‌లో అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. వైరస్‌ తగ్గుముఖం పట్టడానికి చాలా రోజులు పట్టింది. ఇప్పుడు మరోసారి వైరస్‌ విజృంభిస్తుండడంతో చికెన్‌ ప్రియులతోపాటు, పౌల్ట్రీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ వైరస్‌ సోనిన కోడిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించకపోవం కూడా కోళ్లు పెద్ద సంఖ్యలో మృతికి కారణమంటున్నారు. అప్పట్లో కూడా భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ యజమానులు చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా ఏళ్ల తర్వాత వైరస్ తగ్గింది. ఇంతలో చాలా నష్టాలు చవి చూశారట. మరోసారి ఇప్పుడు ఈ వైరస్‌ రావడంతో పౌల్ట్రీ యజమానులతో పాటు చికెన్ ప్రేమికులు కూడా ఆందోళన చెందుతున్నారు.

గుండె చుట్టూ నీరు చేరి గుండెపోటుతో కోడి మరణిస్తుంది. వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నప్పటికీ, వైరస్‌ సోకిన కోళ్లకు అది పని చేయడం లేదు. మృత్యువాత చెందిన కోళ్లను రహదారుల పక్కన సంచుల్లో వేయడం వల్ల వైరస్‌ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ సోకిన కోడి వల్ల సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర కోళ్లకు కూడా వైరస్‌ సోకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కోళ్ల మధ్య వేగంగా వ్యాపించే ఈ వైరస్‌ కారణంగా కొన్ని గంటల్లోనే పెంపక కేంద్రాల్లోని అన్ని కోళ్లు చనిపోతున్నాయి. కోళ్ల కళేబరాలను 3 అడుగుల లోతైన గోతిలో పూడ్చి, సున్నం వేసి నశింపజేయాలని, లేదా కాల్చేయాలని సూచిస్తున్నారు. ఈ విధంగా చేస్తే వైరస్‌ వ్యాప్తి నుంచి మిగిలిన కోళ్లను రక్షించవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది