china : భారత్ కంపెనీలపై చైనా నీచమైన బుద్ధి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

china : భారత్ కంపెనీలపై చైనా నీచమైన బుద్ధి

 Authored By brahma | The Telugu News | Updated on :3 March 2021,12:09 pm

china : ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వ్యాధికి వ్యాక్సిన్ ను కనిపెట్టిన భారతీయ సంస్థలపై చైనా ప్రభుత్వం కన్నేసింది. ఆ దేశం కంటే భారతీయ వ్యాక్సిన్ లకే అధిక ప్రాధాన్యత ఏర్పడిన విషయాన్నీ జీర్ణించుకోలేని చైనా భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కంపెనీలపై హ్యాకింగ్ కు పాల్పడుతున్నట్లు తేలింది. ఇరు దేశాల ఉద్రిక్తల నేపథ్యంలో ఆ దేశం ఈ రకమైన చర్యలకు పాల్పడటం ఆందోళనకరంగా మారింది.

china hackers

చైనా ఆగడాలు రోజు రోజుకు మితిమీరి పోతున్నాయి. డ్రాగన్ దేశంలో పుట్టిన కరోనా కు టీకా తయారీలో ప్రపంచ దేశాలకు ఆశ జ్యోతిలుగా మారిన భారత్ బయోటెక్ ను సీరం ఇన్స్టిట్యూట్ లను చైనా హ్యాకర్లు లక్ష్యం చేరుకోవటం జరిగింది. సైఫైర్మ అనే సంస్థ నిఘా వర్గాలు ఈ విషయాన్నీ బయటపెట్టాయి. మహమ్మారి కారణంగా ఏడాది పాటు ఇబ్బందులకు గురి అవుతున్న భారత్ సహా అనేక దేశాలకు భారత్ బయోటెక్ ఆపద్బాందువుడి పాత్ర పోషించాయి.

ఇది చైనాకు కంటికింపుగా మారటంతో రెండు సంస్థలపై దొంగదెబ్బ తీసేందుకు ప్లాన్ చేసింది ఆ దేశం. ఆ సంస్థల ఐటీ వ్యవస్థలపై ఏపీటీ 10 అనే బృందం ద్వారా సైబర్ దాడులకు తెగబడింది చైనా. ఈ విషయాన్ని ప్రముఖ సంస్థ సైఫైర్మ వెల్లడించింది. కొద్దీ నెలలుగా ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో పరిస్థితిలు ఉద్రిక్తలుగా మారాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు కరోనా కు విరుగుడుగా వ్యాక్సిన్ ను తయారుచేసి, సాయంగా లేదా డబ్బులకు ఇతర దేశాలకు విక్రహిస్తూ వస్తున్నాయి.

అయితే చైనా తయారు చేస్తున్న కరోనా టీకా లతో పోల్చి చూస్తే భారత్ టీకాలే ప్రపంచ వ్యాప్తంగా అధిక విశ్వాసంతో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి అమ్ముడైన వ్యాక్సిన్ ల్లో భారత్ వ్యాక్సిన్ల శాతం 60. ప్రపంచాన్ని కాపాడటంలో భారతీయ సంస్థలు ముందు ఉండటాన్ని చైనా తట్టుకోలేకపోతుంది. దీనితో తమ అధీనంలో పనిచేసే హ్యాకర్ల బృందంతో భారతీయ సంస్థలను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.

ఏపీటీ 10 అనే బృందం ఈ రెండు సంస్థలను టార్గెట్ చేయటంతో కాకుండా వాటి యొక్క సప్లై చైన్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. దీని ద్వారా వ్యాపార పరంగా లాభం పొందాలనేది దాని లక్ష్యమని సైఫైర్మ అధికారి కుమార్ రితేష్ చెప్పాడు. ఈయన గతంలో బ్రిటిష్ విదేశీ నిఘా సంస్థ ఎంఐ-6 లో పనిచేసాడు. ముఖ్యంగా సీరంపై ఏపీటీ 10 గురి ఎక్కువగా ఉన్నట్లు చెప్పాడు. దీనిని అడ్డుకునేందుకు భారతీయ సంస్థలు కూడా తీవ్రంగా పనిచేస్తున్నాయని తెలుస్తుంది.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది