పునాదిరాళ్లు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు పైకి ఎదిగారు చిరంజీవి. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శోభన్ బాబు వంటి గొప్ప గొప్ప నటులు చిత్ర పరిశ్రమను ఏలుతున్న కాలంలో సినిమాల్లోకి అడుగు పెట్టిన చిరంజీవి తనకుంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని మెగాస్టార్ గా గుర్తింపు సొంతం చేసుకున్నారు. చిరంజీవికి ఇన్ని హిట్లు సాధించి పెట్టిన చిత్రాల్లో రాధిక, సుమలత, విజయశాంతి, సుహాసిని, భానుప్రియ వంటి వారు నటించినవే అధికంగా ఉండటం విశేషం. అయితే వాటిల్లోనూ చిరంజీవి రాధిక కలిసి నటించిన సినిమాలే అధికం. వీరద్దరి సినిమాలకు అప్పట్లో తెలుగునాట ఎంత క్రేజ్ అయితే ఉండేదో.. రాధికతో చిరంజీవికి కూడా అంతే ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతుండటం విశేషం.
అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతుండటం విశేషం. అయితే ఓ సినిమా షూటింగ్ లో భాగంగా రాధిక మన మెగాస్టార్ చెంపపై గట్టిగా కొట్టిందట.చిరంజీవి రాధిక ల కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ప్రియ అయినప్పటికీ… ముందుగా విడుదల అయ్యింది మాత్రం న్యాయం కావాలి. ఈ సినిమాలో చిరంజీవిది నెగిటివ్ రోల్. ఈ చిత్రంలో చిరంజీవి రాధికను ప్రేమించి శారీరకంగా లోబరచుకుని.. తర్వాత మోసం చేస్తాడు. అప్పుడు రాధిక చిరును నిలదీస్తూ.. నన్ను ఎందుకు మోసం చేశావంటూ గట్టిగా చెంప మీద కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. ఈ సీన్ కోసం రాధిక పదే పదే టేకులు తీసుకుందట.
చిత్రీకరణ ఆలస్యం అవుతుండటంతో స్వయంగా చిరంజీవే తనను గట్టిగా కొట్టమని చెప్పడంతో రాధిక క్యారెక్టర్లో లీనమై చిరు చెంపను ఒక్కసారిగా చెల్లుమనిపించిందట. ఆ దెబ్బతో పాపం మన మెగాస్టార్ చెంప ఎర్రగా వాచిపోయిందట. అది చూసి బాధపడ్డ రాధికతో.. షూట్ లో ఇలాంటిన్నీ సాధారణమే అంటూ అవేమి పట్టించుకోవద్దని చెప్పాడట. అనంతరం చిత్ర దర్శకుడు కోదండ రామిరెడ్డితో ఇలాంటి షాట్ మరొకటి ఉందా అండి…? అని అడగగానే అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారట. 1981లో విడదలైన ఈ సినిమా నిర్మాత క్రాంతికుమార్‌కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.