singer Sid Sriram remuneration News going viral
Sid Sriram : సిద్ శ్రీరామ్.. తెలుగు గాయకుల్లో ఓ సంచలనం. అనతికాలంలోనే గొప్ప పేరు తెచ్చుకున్న సింగర్. సాధారణంగా ఏ గాయకులకు అయినా అంత క్రేజ్ ఉండదు. ఒక ఎస్పీ బాల సుబ్రమణ్యం, ఒక యేసుదాస్, ఒక ఏఆర్ రెహమాన్ వంటి మేల్ సింగర్ లకు ఉన్నంత అభిమానులు ఇటీవల కాలంలో సిద్ కి తప్ప ఏ గాయకుడికి లేరనే చెప్పాలి. సాధారణ గాయకుడిగా సైలంట్ గా వచ్చిన సిద్… ఎవరూ ఊహించని విధంగా దూసుకెళ్లి కోట్లాది మంది శ్రోతలను గెలుచుకున్నాడు. అయితే సిద్ కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.యువతలో ఫుల్ డిమాండ్ ఉన్న ఈ పాపులర్ సింగర్ కు ఒక్క పాటకు ఎంత పుచ్చుకుంటున్నాడు అనే సందేహం చాలా రోజుల నుంచి ఆయన అభిమానులను వెంటాడుతూనే ఉంది.
ఈయన రెమ్యునరేషనే ఇప్పుడు ఇక్కడ చర్చగా మారింది. సాధారణంగా ప్రస్తుతం ఏ సింగర్ కైనా ఒక్క పాట పాడితే వారికి రూ. 20 వేలను పారితోషికంగా ఇస్తున్నారు. ఒకవేళ వారు టాప్ సింగర్ అయితే రూ. 50 వేలు మరీ ఫేమస్ సింగర్ అయితే రూ. లక్ష వరకే ఇస్తున్నారు. కానీ సిద్ శ్రీరామ్ కి ఉన్న ఫాలోయింగ్ వేరు కాబట్టి… ఆయనకు మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని ఆయనకు ఒక్క పాటకు గానూ సుమారు రూ. 4.5లక్షల వరకు ఇస్తున్నట్లు ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి మిగతా గాయకులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అయినప్పటికీ యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ కారణంగా సిద్ అడిగినంత నిర్మాతలు ఆయనకు ముట్ట చెబుతున్నారని సమాచారం.
singer Sid Sriram remuneration News going viral
సిద్ పాడిన ప్రతీ పాట ఈ మధ్య ఎంత పెద్ద హిట్ అవుతోందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఫెయిల్ అయినా సరే ఈయన పాడిన ప్రతీ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కొన్ని కొన్ని సినిమా లైతే భారీ బడ్జెట్ చిత్రాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. మరీ ముఖ్యంగా గీత గోవిందం, అల వైకుంఠపురం సినిమాలలో సిద్ పాడిన పాటలు ఓ రేంజ్ లో అలరించాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.