AP Police : ఎనీ టైం అతన్ని అరెస్ట్ చేయబోతున్నారు?? రంగంలోకి దిగిన ఏపీ పోలీస్..!
AP Police : ప్రస్తుతం ఏపీలో ఇదే విషయం బాగా చర్చనీయాంశం అవుతోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. దాని కోసం సీఐడీ అధికారులు నర్సీపట్నంలో ఉన్న విజయ చింతకాయల ఇంటికి వెళ్లారు. అయితే.. ఆయన కొన్ని రోజుల కింద భారతిపై సోషల్ మీడియాలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నర్సీపట్నంలో విజయ్ ఇంటికి వెళ్లిన సీఐటీ అధికారులు.. అక్కడ విజయ్ తల్లితో మాట్లాడారు. ఆమె మున్సిపల్ కౌన్సిలర్. పేరు.. పద్మావతి. విజయ్ గురించి ఆమెను సీఐడీ అధికారులు వాకబు చేశారు.
అయన సమయానికి అందుబాటులో లేకపోవడంతో.. పద్మావతికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే.. పలు సెక్షన్లపై విజయ్ మీద కేసు నమోదు చేశారు. మంగళగిరి సైబర్ క్రైమ్ స్టేషన్ లో గత సంవత్సరం అక్టోబర్ లో కేసు నమోదు అయింది. దానికి సంబంధించిన వివరాలను నోటీసులలో పొందుపరిచారు. విజయ్ లేకపోయినా.. ఆయన తల్లికి అందజేసిన నోటీసుల్లో ఈనెల 27న విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇది వరకు కూడా చింతకాయల విజయ్ కు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నోటీసులు జారీ చేశారు.
AP Police : ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని విజయ్ కు నోటీసులు
దానిపై విజయ్ కోర్టు మెట్లు కూడా ఎక్కారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోకుండా కోర్టు స్టే విధించింది. అయితే.. ఇప్పుడు మరోసారి భారతిపై వ్యాఖ్యలు చేయడంతో.. విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ అధికారులు నర్సీపట్నం వెళ్లి మరీ నోటీసులు ఇవ్వడం సర్వత్రా సంచలనం సృష్టించింది. మరోవైపు ఈనెల 27న టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అదే రోజున విజయ్ ను విచారణకు హాజరు అవ్వాలంటూ అధికారులు నోటీసులు జారీ చేయడంపై ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరి.. విజయ్.. సీఐడీ నోటీసులకు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.