YS Jagan : ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం వైఎస్ జగన్ కు ఉందా?
YS Jagan : ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వైకాపా ముఖ్య నాయకులు ఆ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని ఈ విషయం పై స్పందిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ఉన్న వారు మాత్రమే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని.. మా నాయకుడికి అలాంటి భయాలు లేవని, ప్రజలు ఇచ్చిన ఐదు సంవత్సరాల పూర్తి అధికారం ముగిసిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళతామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ముందస్తు ఎన్నికల ఫలితాలు ప్రజల్లో ప్రభుత్వం పై ఉన్న అభిప్రాయంను మార్చలేవని.. ఫలితాన్ని తారు మారు చేయలేవని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మరో రెండు సంవత్సరాలకు ఎన్నికలు జరిగినా అది జగన్ కి ప్రయోజనమే అనేది వైకాపా నాయకులు మాట. గత మూడు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి.ప్రజలు ఆ విషయాన్ని గమనించి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్ ను మళ్లీ సిఎంగా చేస్తారని వైకాపా నాయకులు ధీమాతో ఉన్నారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రజల నిర్ణయాన్ని పక్కకు పెట్టడం అవుతుందని.. వారు ఇచ్చిన ఐదు సంవత్సరాల అధికారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న తర్వాత మాత్రమే సాధారణ ఎన్నికలకు వెళ్దాం అంటూ జగన్ ఇటీవల పార్టీ నాయకులు తెలియజేశారని సమాచారం అందుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేంత భయం కానీ.. అభద్రతా భావం కానీ జగన్ కి లేదు. వైకాపా నాయకులు ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్దం అన్నట్లుగా వారు తెలియజేస్తున్నారు. కనుక షెడ్యూల్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.