CM Jagan : పబ్లిసిటీ పిచ్చితో జనాలను చంపడమే చంద్రబాబు ప‌ని.. సీఎం జగన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Jagan : పబ్లిసిటీ పిచ్చితో జనాలను చంపడమే చంద్రబాబు ప‌ని.. సీఎం జగన్

 Authored By prabhas | The Telugu News | Updated on :30 December 2022,10:00 pm

CM Jagan : చంద్రబాబు తన పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారరని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కందకూరులో చంద్రబాబు పాల్గొన్న రోడ్ షోను ఉద్దేశపూర్వకంగా ఇరుకు రోడ్డులో నిర్వహించి అమాయకుల ప్రాణాలు పోయేలా చేశారని విమర్శించారు. గతంలో జరిగిన గోదావరి పుష్కరాల్లో కూడా ఇదే తరహా పబ్లిసిటీ కోసం 29 మంది ప్రాణాలతో చెలగాటం ఆడారని విమర్శించారు. నర్సీపట్నంలోని మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమం అనంతరం స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో ప్రతి వర్గాన్ని వంచించిన చంద్రబాబు సభకు జనం ఎందుకొస్తారని ప్రశ్నించారు. రుణాలు మాఫీ చేస్తానని మోసం చేసినందుకా.. అని ఎద్దేవా చేశారు. రుణ మాఫీ పేరుతో రైతులను,

డ్వాక్రా మహిళలను బాబు మోసం చేశారన్నారు. ఇవన్నీ చేసిన చంద్రబాబు సభకు జనం భారీగా వచ్చారని నిరూపించి పబ్లిసిటీ చేసుకునేందుకు ప్రయత్నించారు. డ్రోన్ వీడియోలు భాగా వచ్చేందుకు ఇరుకు రోడ్డులో అమాయక కార్యకర్తలను తోసి వారి మరణాలకు కారణం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరుకు రోడ్డులోకి జనాన్ని నెట్టి 8 మందిని చంపేశారన్నారు. రాజకీయాలంటే డ్రోన్ షూటింగ్‌లు కాదన్నారు. రాజకీయం అంటే డైలాగులు కాదు, డ్రోన్‌ షాట్‌లు, డ్రామాలు కాదని చంద్రబాబుకు సీఎం జగన్ సూచించారు. రాజకీయమంటే రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, నిరుపేద, మధ్య తరగతి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తూ సర్వతోముఖాభివృద్ధి తీసుకురావడమని పేర్కొన్నారు.

CM Jagan About on Chandrababu

CM Jagan About on Chandrababu

మృతుల్లో చంద్రబాబుకు కులం కనిపిండం రాష్ర్టానికి పట్టిన ఖర్మ మంత్రి మేరుగు నాగార్జున కందకూరు సభలో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా మరణించిన వారి  విషయంలో చంద్రబాబుకు కులం కనిపించడం రాష్ర్టానికి పట్టిన ఖర్మ అని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. కార్యకర్తలు చనిపోతే ఇది తన తప్పు కాదు కార్యకర్తలకు క్రమశిక్షణ లేదని తప్పు కార్యకర్తల మీద తోసేయడం ఏంటని ప్రశ్నించారు.  ఇది టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు అవమానించడమేనని విమర్శించారు. చనిపోయిన వాళ్లలో నలుగురు ఎస్సీలు, అందులో ఇద్దరు మాలలు,

మరో ఇద్దరు మాదిగలు, ఒక యానాది మహిళ, మరో బీసీ, మిగిలిన వాళ్లు ఓసీలంటూ చెప్పడం సిగ్గుచేటన్నారు.  చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తూ శవాల మీద పేలాలు ఏరుకునేలా తయారయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేద, బడుగు బలహీన వర్గాలు వారిని సభకు వస్తే డబ్బులు ఇస్తామని తీసుకొచ్చి, జనం ఎక్కువగా వచ్చారని చూపించడం కోసం ఇరుకు సందులో మీటింగ్ పెట్టి, దానివల్ల చనిపోయిన ఆ బలహీన వర్గాల ప్రాణాల విలువ నువ్విచ్చిన ఎక్సగ్రేషియా‬ సరితూగుతుందా? అని మంత్రి ప్రశ్నించారు. చనిపోయిన తరువాత వారి కులాలను తీసుకొచ్చి ఓట్లు అడుక్కోవడానికి, వాళ్ళు నా వెనక ఉన్నారని చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గుండాలన్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది