Ys jagan : పోలవరం అవసరాన్ని గుర్తించిన గొప్ప నాయకుడు వైఎస్సార్
ఏపీ రైతుల సుదీర్ఘ స్వప్నం ఆయిన పోలవరం ప్రాజెక్టు అతి త్వరలోనే ముగుస్తుందని అంటూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో కలిసి పోలవరం ప్రాజెక్టు ను మరియు పోలవరం ప్రాజెక్టు కు సంబంధించిన బాధితుల పునరావాస కాలనీల ను సందర్శించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం అవసరంను మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గుర్తించారని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు అని కూడా చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీలకు సందర్శించిన సమయం లో కాలనీ వాసులు కేంద్ర మంత్రి కి మరియు ముఖ్యమంత్రి కి సాదర స్వాగతం పలికారు. బాధితులతో ముఖ్యమంత్రి మరియు కేంద్ర మంత్రి మాట్లాడటం జరిగింది. గిరిజన సాంప్రదాయంతో కేంద్ర మంత్రికి మరియు ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు.ప్రస్తుతం తాము ఉంటున్న కాలనీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని గతం లో ఉన్న ఊర్ల కంటే ఈ కాలనీల్లో మరింతగా వసతులు ఉండటం వల్ల తమ జీవితం బాగుందన్న వారు ఆనందం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ను మరింత స్పీడ్ గా పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సమయం లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ పోలవరం కు కావలసిన ప్రతి ఒక్కరూ రూపాయిని కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని హామీ ఇచ్చారు. పోలవరం నిర్మాణం కు సంబంధించిన పలు కార్యక్రమాలను ముఖ్యమంత్రితో కలిసి కేంద్రమంత్రి సమీక్షించారు. పోలవరం ప్రాజెక్ట్ ని మరో ఏడాదిలో పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే కచ్చితంగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.