CM Jagan : అప్పుడే జన్మించిన శిశువుల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం!
CM Jagan : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు సంబంధించిన జనన ధృవీకరణానికి సంబంధించిన తరహాలోనే శిశు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌ను చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.దీనికి సంబంధించి ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడానికి డేటా ఆపరేటర్లకు త్వరితగతిన శిక్షణ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.ఈ ప్రక్రియద్వారా తల్లిదండ్రులు మళ్లీ మీ సేవ, ఆధార్ సెంటర్లకు తిరగాల్సిన అవసరం ఉండదు.జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
CM Jagan : పేరెంట్స్‌కు తప్పనున్న ఇబ్బందులు
జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇక మీదట ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులకు వెంటనే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ రానుంది. ఈ ప్రక్రియను తీసుకొచ్చేందుకు ఏపీ వైద్యశాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేసేందుకు వీలుగా ఏరియా, జిల్లా, బోధన ఆసుపత్రులకు అవసరమైన ట్యాబులు, ఫింగర్ ప్రింట్ స్కానర్‌లను సమకూర్చనున్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన పిల్లలకు జనన ధృవీకరణ ధృవపత్రాల తరహాలోనే శిశు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ జరుగుతుంది. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు యుఐడీఏఐఓ పరీక్షను నిర్వహిస్తారు.
అందులో అర్హత సాధించిన వారికి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ పై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు.ఈ ప్రక్రియ ముగిసాక ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను అధికారంగా ప్రారంభించనున్నారు. ముందుగా ఐదేళ్లలోపు పిల్లలకు నీలిరంగులో టెంపరరీ ఆధార్‌ను ఇస్తారు. దీనికి శిశువుల బయోమెట్రిక్ డేటాతో పని లేదు. పిల్లల ఫోటో, తల్లిదండ్రుల పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ తదితర వివరాల ఆధారంగా శిశువుకు స్పాట్‌లో ఆధార్ కార్డును జారీ చేస్తారు. పిల్లలు పెరిగాక వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఏరియా అధికారుల నుంచి ధ్రువపత్రం, చిరునామా పలు ఆధారిత వివరాల ప్రకారం పర్మినెంట్ ఆధార్ కార్డును ఇస్తారు.