Modi : ఇప్పుడు కేసీఆర్ ఏ మెహం పెట్టుకుని మోడీని ఆహ్వానిస్తారు?
Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల హైదరాబాదు లో పర్యటించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పర్యటన ను బహిష్కరించిన విషయం తెలిసిందే. ప్రధాని పర్యటనకు జ్వరం వచ్చిందంటూ కేసీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశం గా మారింది. ముఖ్యమంత్రి కార్యాలయం కేసీఆర్ కి జ్వరం కారణంగా ఆయన పిఎం ఈ కార్యక్రమాలకు హాజరు కాలేకపోయారు అంటూ అధికారికంగా ప్రకటించింది. కానీ మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రధాని రాష్ట్రానికి ఏం చేశారని ఆయన వచ్చినప్పుడు స్వాగతాలు పలకాలి అన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు దుమారంను రేపుతున్నాయి. ఇప్పటికే బిజెపి నాయకులు ప్రధాని వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.అందుకు గాను సీఎం కేసీఆర్ కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ అందుకోవడం ఖాయం అంటూ వాళ్ళు హెచ్చరిస్తున్నారు.
ఈ సమయంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని యాదాద్రి గుడి ఆరంభానికి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వార్తలకు మరియు మీమ్స్ కు తెర తీస్తుంది. ప్రధాని పర్యటనకు వచ్చిన సమయంలో కనిపించకుండా పోయిన కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని యాదాద్రికి ఆహ్వానిస్తే వస్తాడా అనేది చర్చనీయాంశంగా మారింది. అయినా ఢిల్లీ వెళ్లి ప్రధానిని ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ ఆహ్వానిస్తారు అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమని కేసీఆర్ ఆహ్వానిస్తే యాదాద్రికి మోడీ రావడం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మాత్రం బీజేపీ మరియు టిఆర్ఎస్ పార్టీ మధ్య జరుగుతున్న ఈ యుద్దం ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు.
సీఎం కేసీఆర్ కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ భక్తుడు అంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రాజకీయ వ్యూహాత్మకం లో భాగంగానే మోడీ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉన్నాడని.. అదే వ్యూహంలో భాగంగా బిజెపి నాయకులు విమర్శలు చేస్తున్నారని.. ఇది ప్రజలను మోసం చేయడం తప్ప మరేం లేదు అంటూ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు పక్కన పెడితే అసలు కేసీఆర్ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని యాదాద్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తారా… ఒకవేళ కేసీఆర్ ఆహ్వానిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నుంచి వచ్చే సమాధానం ఏంటి… ప్రధాని నరేంద్రమోడీ యాదాద్రికి వస్తే అప్పుడు జరిగే రాజకీయ పరిణామాలు ఏమిటి…. అనే ప్రశ్నలు హాట్ టాపిక్ గా ఉన్నాయి.