KCR : గజ్వేల్ ను వీడబోతున్న కేసీఆర్.. ఏదో మాస్టర్ ప్లాన్ వేసినట్లున్నాడు
KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ను వచ్చే ఎన్నికల్లో వదిలి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుండి కాకుండా మరో నియోజక వర్గం నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా ఆ వార్తల వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తాజాగా పార్టీ కార్యకర్తల మరియు నాయకుల సమావేశం జరిగింది. ఆ సమయంలో గజ్వేల్ ను వీడే యోచనలో ఉన్నట్లుగా పార్టీ వర్గాలకు సీఎం కేసీఆర్ హింట్ ఇచ్చాడు అంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈ విషయాన్ని ప్రథానంగా హైలైట్ చేస్తూ ఉన్నాయి. దాంతో కేసీఆర్ ఖచ్చితంగా కొత్త నియోజక వర్గంను ఎంపిక చేసుకుంటాడనే వార్తలు వస్తున్నాయి.కేసీఆర్ వీడబోతున్న గజ్వేల్ ను 20218 లో పార్టీలో చేరిన వంటేరు ప్రతాప్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఆయన గజ్వేల్ పై పట్టు కలిగిన నాయకుడు. అందుకే ఆయన కు అవకాశం ఇస్తే తప్పకుండా అక్కడ గెలుస్తాడని కేసీఆర్ భావిస్తున్నాడట. కాని గజ్వేల్ కు చెందిన పాత నాయకులు మాత్రం నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తికి ఎలా సీటు ఇస్తారంటూ ప్రశ్నిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పోటీ చేయాలి లేదంటే సీనియర్ లకు ఆ స్థానంను ఇవ్వాలంటూ అక్కడి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ వారి ని ఎలా శాంతింపజేస్తాడు అనేది చూడాలి. కేసీఆర్ గజ్వేల్ ను వీడటానికి గల కారణం ఏంటీ అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం లో లేడని అందుకే గజ్వేల్ నియోజక వర్గంను మరొకరికి అప్పగించే యోచన చేస్తున్నాడా అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు మరియు నాయకులు చర్చించుకుంటున్నారు.
KCR : కేసీఆర్ పోటీ చేస్తాడా లేదా..?
కాని అసలు విషయం ఏంటీ అంటే కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాడు. కాని తనకు గతంలో కలిసి వచ్చిన నియోజక వర్గంకు వలస వెళ్లబోతున్నాడు. ప్రస్తుతం అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు ఎంపీ సీటు ఇచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది ఎన్నికల వరకు తెలియదు. కేసీఆర్ ఏం చేసినా కూడా ఖచ్చితంగా పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంటుంది. కేసీఆర్ ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ వేసే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు అంటూ కేసీఆర్ అభిమానులు మరియు ఆ పార్టీ నాయకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీని గెలిపించి మూడవ సారి వరుసగా అధికారంను దక్కించుకోవడం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ అండ్ టీమ్ ఉవ్విల్లూరుతున్నారు.