Sagar bypoll : కేసీఆర్ ఏపీని అస్సలు వదలడం లేదు.. సాగర్ ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు?
Sagar bypoll : నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఒక ఉపఎన్నికను ఇంత సీరియస్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ తీసుకోలేదు. ఇప్పటికే ఓసారి హాలియాలో బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్… మరోసారి హాలియాలో బహిరంగ సభను తాజాగా నిర్వహించారు. సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని ఓడించాలంటే… కేసీఆర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అందుకే సాగర్ ఉపఎన్నికలు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంది. తాజాగా సాగర్ ఉపఎన్నికల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్… ప్రచార సభలో ఏపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీని టార్గెట్ చేస్తూ… ఏపీ కన్నా… తెలంగాణ చాలా బెటర్ పొజిషన్ లో ఉందని… దాని కారణం తమ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాం… రైతుల పాదాలను ఆ నీటితో కడుగుతున్నాం. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద అన్ని ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కాళేశ్వరంలో రైతులు ఎలా కేరింతలు కొడుతున్నారో… సాగర్ లో కూడా ప్రజలు, రైతులు అలా కేరింతలు కొట్టాలి. ఒకప్పుడు తెలంగాణలో ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి… అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి.. ఈ యాసంగి సీజన్ లో 52 లక్షల ఎకరాల్లో వరిసాగు చేసింది తెలంగాణ. కానీ.. ఏపీలో మాత్రం కేవలం 29 లక్షల వరి సాగునే చేశారు. తెలంగాణ కన్నా ఏపీ వరిసాగులో ఎక్కడో వెనకపడిపోయింది. తెలంగాణ ఒకప్పటిలా కాదు… ఇప్పుడు ధనిక రాష్ట్రం… అంటూ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Sagar bypoll : అసెంబ్లీలోనూ ఏపీపై కేసీఆర్ హాట్ కామెంట్స్
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కూడా సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఏపీలో అంతా రివర్స్ అయిందని. ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం భూమి అమ్మితే.. తెలంగాణలో రెండు ఎకరాలు కొనుక్కునేవారని… కానీ… ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో రెండు ఎకరాలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.. ఏపీలో అంతా రివర్స్ అయిపోయింది… అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో సంచలనం సృష్టించాయి. వాటిని ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పించేందుకు వాడుకుంటున్నాయి.