CM Revanth Reddy : సింగరేణి కార్మికులకు రేవంత్ సర్కార్ శుభవార్త… ఒక్కొక్కరికి కోటి రూపాయలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Revanth Reddy : సింగరేణి కార్మికులకు రేవంత్ సర్కార్ శుభవార్త… ఒక్కొక్కరికి కోటి రూపాయలు…!

 Authored By aruna | The Telugu News | Updated on :27 February 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  CM Revanth Reddy : సింగరేణి కార్మికులకు రేవంత్ సర్కార్ శుభవార్త... ఒక్కొక్కరికి కోటి రూపాయలు...!

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తూ వస్తుంది. ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారంటీలలో కొన్నింటిని అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంమార్చి నాటికి అన్ని గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ప్రణాళికను చేపడుతుంది. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలను కూడా నెరవేర్చుకునేందుకు కార్యకరణ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ తాజాగా సింగరేణి ఉద్యోగులకు శుభవార్త తీసుకువచ్చింది. సింగరేణి ఉద్యోగుల కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివలన సింగరేణి లోని ప్రతి ఒక్కరికి కోటి రూపాయల వరకు లబ్ధి జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే…

తాజాగా రేవంత్ సర్కార్ సింగరేణి ఉద్యోగులకు తీపి కబురు తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగుల కోసం కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పటివరకు సింగరేణి ఉద్యోగుల ప్రమాద బీమా 40 లక్షలు ఉండగా ఇప్పుడు దానిని రేవంత్ సర్కార్ కోటి రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా అవుట్ సోర్సింగ్
ఉద్యోగుల ప్రమాద బీమాను 20 లక్షలు నుండి 40 లక్షలకు పెంచుతున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే సింగరేణి ఉద్యోగులలో దాదాపు 43 వేల మందికి ఈ కోటి రూపాయల ప్రమాద బీమా పథకం వర్తించనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు కేవలం సైనికులకు మాత్రమే కోటి రూపాయల ప్రమాద బీమా ఉండేది. ఇక ఇప్పటినుంచి అది సింగరేణి కార్మికులకు కూడా వర్తిస్తుంది.

ఈ మేరకు బ్యాంకర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంవోయి కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రోజు హైదరాబాద్ సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశాలు కూడా జరిపారు. సింగరేణి సంస్థ ఉద్యోగుల ప్రమాద బీమా పథకంపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో రేవంత్ సర్కార్ కీలక ఒప్పందాలను చేసుకున్నట్లు సమాచారం. దీంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోఎకౌంటు కలిగి ఉన్న సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా ఇచ్చేందుకు బ్యాంక్ అధికారులు సైతం అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ పథకం రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన లేదా శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బంది అందరికీ కూడా వర్తిస్తుంది.

ఇక ఈ కార్యచరణలో మాట్లాడిన రేవంత్ రెడ్డి సింగరేణి కార్మిక లోకానికి ఇది చారిత్రాత్మక రోజు అవుతుందని వర్ణించారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర ఎప్పటికీ మరువలేనిదని ఈ సంస్థ విషయంలో గత పాలకులు సృష్టించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా గడిచిన 10 సంవత్సరాలలో సింగరేణి కార్మికులకు సరైన న్యాయం జరగలేదని పదేళ్ల పాలనలో బి.ఆర్.ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థ నిధులను దుర్వినియోగం చేసిందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా గత ప్రభుత్వం సింగరేణి ఉద్యోగులకు జీతాలను నెల చివర్లో చెల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారికి జీతాలను మొదటి వారంలోనే చెల్లించే దిశగా అడుగులు వేస్తున్నారని గుర్తు చేశారు. అదేవిధంగా మరో 15 రోజుల్లో అందరికీ రైతుబంధు కూడా చెల్లిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది