Chandrababu – Ys Jagan : చంద్రబాబు కొత్త పథకాల మీద జగన్ బ్రహ్మాస్త్రం !
Chandrababu – Ys Jagan : జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కి సరిగ్గా 4 ఏళ్లు అయింది. 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఇంకో సంవత్సరం మాత్రమే సమయం ఉంది. వచ్చే సంవత్సరం ఈ టైమ్ కల్లా ఏపీలో కొత్త ప్రభుత్వం వస్తుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఎవరు.. అనేది మాత్రం స్పష్టం కావడం లేదు. అయితే.. రెండో సారి జగన్ ముఖ్యమంత్రి అవుతారా? వైసీపీని గెలిపించుకుంటారా? లేక ప్రజలు మరో పార్టీని గెలిపిస్తారా? అనేది పక్కన పెడితే ఏపీలో ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడి మాత్రం మొదలైంది. 2019 ఎన్నికల ముందు.. ఆయన ఏ హామీలు అయితే ఇచ్చారో..
ఆ హామీలతో పాటు ఇంకా కొత్త హామీలను కూడా నెరవేర్చి.. సరికొత్త పథకాలను తీసుకొచ్చి ఏపీని అభివృద్ధి దిశలో తీసుకెళ్లారు. అసలు ఏపీలో అమలు అవుతున్న పథకాలు ఏవీ ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదు. అందుకే సీఎం జగన్ ప్రస్తుతం ఏపీ ప్రజల గుండెల్లో ఉన్నారు. ఆ సంక్షేమ పథకాలనే అడ్డం పెట్టుకోని ఏపీలో అధికారంలోకి రావాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అందుకే ఆయన మహానాడులో టీడీపీ మేనిఫెస్టోను ప్రకటించారు. అసలు.. వైసీపీని ఎదుర్కొనే దమ్ము టీడీపీకి ఉందా? వైసీపీ పార్టీని ఓడించడం కోసం చంద్రబాబు బ్రహ్మాస్త్రాన్ని తీసుకొచ్చానని అనుకుంటున్నారు.
Chandrababu – Ys Jagan : వైసీపీని ఎదుర్కొనే దమ్ము టీడీపీకి ఉందా?
అసలు ఆయన తీసుకొచ్చిన మేనిఫెస్టోలో ఏముందో ఎవరికి తెలియదు. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో వైసీపీ ఓడిపోయింది. కానీ.. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ విజయదుందుబి మోగించింది. 151 స్థానాల్లో గెలిచింది. టీడీపీకి ఏనాడూ ఊహించని పరాభవం ఎదురైంది. ఇప్పుడు సంక్షేమ పథకాల పేరుతో మరోసారి అధికారంలోకి రావడానికి టీడీపీ వేస్తున్న ఎత్తుగడలు ఇవి. కానీ.. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చినా గత నాలుగేళ్లలో సీఎం జగన్.. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించి ఇప్పుడు చంద్రబాబు కూడా ఆ పథకాలను మెచ్చుకొని వాటినే ప్రకటించేలా చేశారు.