YS Jagan : ఢిల్లీకి సీఎం జగన్.. దానిపై తాడో పేడో తేల్చుకోవడానికేనా?
YS Jagan : ప్రస్తుతం ఏపీలో సర్వత్రా చర్చనీయాంశం అవుతున్న ఇష్యూ ఒక్కటే. అదే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల హక్కు అని.. దాన్ని తీసుకెళ్లి కార్పొరేట్లకు దారాదత్తం చేయడం ఏంటంటూ ఏపీ మొత్తం.. కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ పార్టీ మీద గుర్రుగా ఉంది. ఏపీ ప్రజలతో పాటు పార్టీలతో సంబంధం లేకుండా నేతలంతా ఏకమై విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆందోళన చేస్తున్నారు. కొన్ని పార్టీలు మాత్రం దీనిపై రాజకీయం చేస్తున్నాయి కానీ.. ఎక్కువ శాతం అందరూ విశాఖ స్టీల్ ప్లాంట్ పై కలిసికట్టుగా ఉండి.. తమ హక్కును కాలరాస్తున్నారంటూ బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ప్రధాని మోదీని కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
అయితే.. ఈ నేపథ్యంలో.. ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో ఏపీలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఎందుకంటే.. ఓవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ లొల్లి ఏపీలో నడుస్తున్న సమయంలో సీఎం జగన్.. రేపు అంటే బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్తున్నారు.. అంటూ వార్తలు వస్తున్నాయి.
ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారట. ఇప్పటికే అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం సీఎం జగన్.. చాలారోజులు వెయిట్ చేశారని.. బుధవారం ఆయన్ను కలిసేందుకు జగన్ కు అపాయింట్ మెంట్ దొరికిందని తెలుస్తోంది.
YS Jagan : విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అమిత్ షాతో జగన్ చర్చిస్తారా?
అయితే.. అసలు జగన్ ఢిల్లీకి ఈ సమయంలో ఎందుకు వెళ్తున్నారు.. అనేదానిపై సర్వత్రా ఆందోళన నెలకొన్నది. ఏపీలో నెలకొన్న కొన్ని సమస్యలతో పాటు.. ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని సీఎం జగన్.. అమిత్ షాను కోరుతారని తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కేంద్రం పరిధిలోనిదని.. దానిపై ఎవ్వరూ మాట్లాడొద్దని.. ఇప్పటికే అమిత్ షా స్పష్టం చేసిన నేపథ్యంలో జగన్.. దీని గురించి అమిత్ షా వద్ద ప్రస్తావిస్తారా? లేక రాష్ట్రంలో నెలకొన్న వేరే సమస్యల గురించి చర్చిస్తారా? అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.