Ys Jagan : జగన్ తీసుకున్న నిర్ణయంతో ఏపీలో అవినీతికి ఆగిపోవడం ఖాయం
Ys Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో రాబోయే రోజుల్లో అవినీతి అనేది రాష్ట్రంలో ఉండక పోవచ్చు అంటూ రాజకీయ విశ్లేషకులు మరియు మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్ ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఏపీ లో అవినీతికి తావు లేదు అనే విధంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త నియమాలను తీసుకున్నాడు. గతంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కూడా లంచం తీసుకుంటూ పట్టుబడితే లేదా అవినీతి ఆరోపణలు నిజం అని తేలితే వారిపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు కఠిన శిక్ష పడేలా నిర్ణయం తీసుకున్నారు. అది బీహార్ లో ఎంత వరకు అమలు అవుతుందో ఏమో కాని త్వరలో ఏపీలో మాత్రం కఠినంగా అమలు అయ్యే అవకాశం కనిపిస్తుంది.
Ys Jagan : అధికారులకు ముందస్తు హెచ్చరికలు..
ఏపీలో ప్రభుత్వ అధికారులు ప్రతి చిన్న విషయానికి చిన్న పనికి కూడా లంచాలు డిమాండ్ చేస్తున్నారు అనేది ఆరోపణ. ప్రజలు మరియు కింది స్థాయి అధికారులు కూడా ఉన్నతాధికారుల లంచాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుకే పెద్ద చేపల నుండి చిన్న చేపల వరకు ప్రతి ఒక్కరిని అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో ఇకపై ఏ అధికారి అయినా రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటూ పట్టుబడితే మూడు నెలల వ్యవధిలో అతిడి కేసు విచారణ పూర్తి చేసి శిక్ష పడేలా చేస్తారు.
Ys Jagan : నాయకులకు కూడా ఇది వర్తింపు..
ప్రభుత్వ అధికారులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఈ నిబంధన కిందకు తీసుకు వచ్చేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంపై సొంత పార్టీ నాయకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తప్పకుండా ఇది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రేజ్ ను పెంచుతుందని వైకాపా నాయకులు అంటున్నారు. అధికారులను మాత్రమే కాకుండా నాయకులను కూడా ఈ కొత్త చట్టం కిందకు తీసుకు రావడం వల్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద సంచలన నిర్ణయం తీసుకున్నారంటూ సొంత పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం దీనిని సమర్థవంతంగా అమలు చేయడంలో వైకాపా ప్రభుత్వం ఎంత వరకు సఫలం అవుతుందో చెప్పలేమని అంటున్నారు.