వైసీపీ నేత రేవతి తీరుపై సీఎం జగన్ సీరియస్.. సీఎంవో నుంచి కాల్.. పదవి ఊస్టింగ్?
ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఏపీలో ఎక్కడ చూసినా ఈ ఘటన గురించే చర్చ. వైసీపీ మహిళా నేత అయి ఉండి… వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ అయి ఉండి.. దేవళ్ల రేవతి వ్యవహరించిన తీరుపై ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేత అయితే.. నడిరోడ్డు మీద అలా ప్రవర్తిస్తారా? అంటూ ఏపీ ప్రజలు, నెటిజన్లు ఆ మహిళా నేతపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి వాళ్లను పార్టీలో పెట్టుకొని సీఎం జగన్ పార్టీ ప్రతిష్ఠకే భంగం కలిగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలోని కాజా టోల్ ప్లాజా వద్ద తన కారును ఆపకుండా వెళ్లేందుకు ప్రయత్నించిన రేవతిని టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకున్నారు. టోల్ ఫీజు కట్టాలంటూ అడగగా.. వాళ్లపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. సిబ్బందిపై చేయి చేసుకొని.. కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను తొలగించి మరీ… అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు రేవతి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ విషయం జగన్ దృష్టికి వెళ్లడంతో.. జగన్.. సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఒక మహిళా నేత అయి ఉండి.. ఇలా ప్రవర్తించడం దారుణమంటూ సీఎం జగన్ కూడా మండిపడినట్టు తెలుస్తోంది.
తనకు వెంటనే సీఎంవో నుంచి కాల్ వచ్చిందట. వెంటనే సీఎంను కలవాలంటూ తనకు సీఎంవో నుంచి కాల్ రావడంతో తనను పదవి నుంచి తీసేస్తారని వార్తలు వస్తున్నాయి. సీఎం జగన్ కూడా తనకు ఇచ్చిన వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి రేవతిని తప్పిస్తారని తెలుస్తోంది. చూడాలి మరి.. సీఎంను రేవతి కలిశాక ఏం జరుగుతుందో?
#WATCH| YSRCP leader D Revathi slaps a toll plaza staff at Kaja Toll in Guntur district after she was stopped when she allegedly refused to pay toll tax #AndhraPradesh pic.twitter.com/NaHAzO6VDm
— ANI (@ANI) December 10, 2020