Bonus | సింగరేణి కార్మికులకు భారీ శుభవార్త .. దీపావళి బోనస్ కూడా ప్రకటించిన కేంద్రం
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికుల కోసం రూ.1,95,610 బోనస్‌ను ప్రకటించగా, ఇప్పుడు దీపావళిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మరో భారీ బోనస్‌ను ప్రకటించింది. ప్రాఫిట్ లింక్డ్ రివార్డ్ (PLR) పథకం కింద ఒక్కో కార్మికుడికి రూ.1,03,000 చొప్పున బోనస్ ఇవ్వనుంది.

#image_title
బోనస్ ప్రకటనకు ముందు ఉత్కంఠ
ఇది కేంద్రం తరఫున ఇప్పటి వరకు బొగ్గు గని కార్మికులకు అందించిన అత్యధిక PLR బోనస్‌గా రికార్డులో నిలిచింది.PLR బోనస్ చెల్లింపు విషయంలో కోల్ ఇండియా యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య గత కొన్ని రోజులుగా చర్చలు కొనసాగాయి. మొదట యాజమాన్యం రూ.98,000 బోనస్ అందించేందుకు ముందుకొచ్చినా, కార్మిక సంఘాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి.
అనంతరం కోల్‌కతాలో జరిగిన కీలక సమావేశంలో, సింగరేణి కోల్‌మైన్స్ సంస్థ డైరెక్టర్ గౌతమ్ పొట్రు సహా పలు కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తీవ్రమైన చర్చల అనంతరం రూ.1,03,000 బోనస్‌పై ఒప్పందం కుదిరింది.గత ఏడాది కార్మికులకు రూ.93,750 PLR బోనస్ అందించగా, ఈ సంవత్సరం అదనంగా రూ.9,250 పెరిగిన బోనస్ లభించనుంది. ఇది కోల్ ఇండియా చరిత్రలో ఇప్పటి వరకు అందించిన అత్యధిక PLR బోనస్ కావడం గమనార్హం.