దుర్మార్గుడిని పట్టిస్తే రూ.10 లక్షలు
హైదరాబాద్‌లోని సైదాబాద్ పరిధి సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజానీకం డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇకపోతే పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసులు టీమ్స్‌గా డివైడ్ అయి సెర్చింగ్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం పోలీసులు కీలక ప్రకటన చేశారు.చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన రాజును పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఇకపోతే జనం నుంచి రాజును ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్ ఉండగా, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కూడా రాజును ఎన్ కౌంటర్ చేస్తామని పేర్కొన్నాడు.
ఎల్బీనగర్‌లో రాజు మద్యం తాగినట్లు..
ఘటన జరిగిన రోజు సాయంత్రం ఎల్బీనగర్‌లో రాజు మద్యం తాగినట్లు ఎల్బీనగర్ వద్ద సీసీ కెమెరాల ద్వారా పోలీసులు తీసుకున్నారు. అతడి స్నేహితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడిపై బైక్ దొంగతనం కేసు ఉన్నట్లు, నిందితుడి భార్య అతడిని వదిలేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నల్గొండ జిల్లాలో రాజు కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రివార్డు ప్రకటన నిందితుడిని పట్టుకునేందుకు యూజ్ అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.