Revanth Reddy Vs Etela Rajender : రేవంత్ రెడ్డి వర్సెస్ ఈటెల రాజేందర్ మధ్య మాటల యుద్ధం వీడియో వైరల్..!!
Revanth Reddy Vs Etela Rajender : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మధ్య మాటల యుద్ధం తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో BRS పార్టీ వద్ద రేవంత్ రెడ్డి పాతిక కోట్లు తీసుకొని కేసిఆర్ తో లాలూచీ పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. ఈటెల రాజేందర్ తనపై చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ప్రమాణ స్వీకారానికి రావాలని..

తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని సవాల్ విసిరారు. ఇదే సమయంలో ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలను రుజువు చేయాలని కోరారు. కేసీఆర్ తో లాలూచీ తన రక్తంలోనే లేదని పేర్కొన్నారు. ఇదే సమయంలో కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై తాను పోరాటం చేస్తే చర్లపల్లి జైలులో నిర్బంధించిన భయపడలేదని చెప్పుకొచ్చారు. ఇంతలా కేసీఆర్ అవినీతిపై పోరాడుతుంటే తమపై నిందలు వేస్తారా అంటూ ఈటెల రాజేందర్ పై రేవంత్ ఫైరయ్యారు. నా నిజాయితీని శంకిస్తే.. మంచిది కాదు. నా కళ్ళల్లో నుండి నీళ్లు రప్పించావు ఈటెల అంటూ రేవంత్ కన్నీటి పర్యంతమయ్యారు.
రేవంత్ సవాల్ పై ఈటెల రాజేందర్ మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలలో 25 కోట్లకు అమ్ముడుపోయినట్లు తాను చేసిన ఆరోపణలు ఆత్మ సాక్షిగా న్యాయబద్ధంగా చేసినవని స్పష్టం చేశారు. ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు. గుడికి వెళ్లి అమ్మతోడు అయ్యే తోడు అనటం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. దీంతో రేవంత్ రెడ్డి మరియు ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.