CM Jagan : సీఎం జగన్ మీద కేసు పెడతా అంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు.. అప్పుడేమైందంటే..!
CM Jagan : ఒక సాదాసీదా లీడర్ మీద కేసు పెట్టడానికే వెనుకాముందు ఆలోచిస్తాం. అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రిపై పోలీస్ కేసు పెట్టాలంటే అసలు అది సాధ్యం అవుతుందా? అది కూడా ఒక సామాన్య వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సీఎం జగన్ మీద కేసు పెడితే అసలు ఆ కేసును పోలీసులు తీసుకుంటారా? ఇలాంటి వింత ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటు చేసుకుంది. యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన తిరిపాలు అనే వ్యక్తి తనకు ఉన్న సమస్యల పరిష్కారం కోసమే ఈ వినూత్న కార్యక్రమాన్ని ఎంచుకున్నాడు.
తనది వీరాయిపాలెం. ఆ గ్రామంలో ఉండేది 500 మంది మాత్రమే. వాళ్లందరికీ ఒకే ఒక్క బోరు ఉందట. ఆ ఊరిలో ఒకే ఒక్క బోరు ఉండటంతో నీటి కోసం గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తోందని.. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించుకున్నాడు తిరిపాలు. అయితే.. నీటి సమస్యపై అధికారులకు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు. దీంతో తన ఊరి సమస్యను పరిష్కరించాలని.. దానికి కారణమైన సీఎం జగన్ మీద కేసు పెట్టాలని అనుకున్నాడు.
CM Jagan : అధికారులు స్పందించకపోవడంతో సీఎం జగన్ పై కేసు పెట్టాలని భావించిన తిరిపాలు
అందుకే యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. సీఎం జగన్ పై కేసు పెట్టాలని పోలీసులకు చెప్పాడు. దీంతో సీఎంపైనే కేసు పెడతావా? అంటూ అక్కడి పోలీసులు అతడిని బెల్ట్ తో చితకబాదారు. గాయాలతోనే బయటికి వచ్చి మీడియాతో మాట్లాడిన తిరిపాలు.. గత ఎన్నికల్లో తాను వైసీపీకి ఓటు వేశానని.. మరి తన సమస్యలను సీఎం జగన్ కాక ఇంకెవరు తీరుస్తారు.. అంటూ ఆయన ప్రశ్నించాడు. మరి.. దీనిపై సీఎం జగన్ స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.