
#image_title
BRS | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం (BRS Office) పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి, ఫర్నీచర్ ధ్వంసం చేయడమే కాకుండా దానికి నిప్పు కూడా పెట్టారు. అలాగే కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఫ్లెక్సీలు చింపేసి, ఆఫీస్‌పై కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు.
#image_title
రచ్చ రచ్చ..
కాంగ్రెస్ నేతల ఆరోపణల ప్రకారం, ప్రభుత్వ భూమిపై బీఆర్‌ఎస్ నాయకులు పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని, గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలీసు బందోబస్తుతో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌ను ఆక్రమించి గులాబీ రంగులు వేయించారని తెలిపారు. ఈ ఆరోపణలతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం ఉదయం ఆందోళనకు దిగారు.
కార్యాలయంలో మంటలు చెలరేగడంతో ఘటనా స్థలంలో పొగలు కమ్ముకున్నాయి. వెంటనే సమాచారం అందుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి, మణుగూరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా బలగాలు మోహరించి ఇరుపక్షాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మణుగూరులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, పోలీసులు నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం.
నేటి వేగవంతమైన జీవనశైలిలో జీర్ణ సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం, ప్రతి రోజు ఉదయం…
Ajith | తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే…
Cricketer | భారత క్రికెట్‌లో ఒకవైపు మహిళల జట్టు వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరిన ఆనందం నెలకొనగా, మరోవైపు క్రికెట్ ప్రపంచం…
cervical Pain | నేటి ఆధునిక జీవనశైలిలో ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం, మొబైల్ ఫోన్ వాడకం పెరగడం, తప్పుడు…
Apple | రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు” ఈ మాట మనందరికీ బాగా…
Rose Petals | గులాబీ పువ్వులు అందం, సువాసనకు ప్రతీకగా నిలుస్తాయి. కానీ ఈ సుగంధ పువ్వులు కేవలం అలంకరణకు మాత్రమే…
Ivy gourd | మన రోజువారీ ఆహారంలో కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్,…
November | నవంబర్ నెల చలికాలం ఆరంభమయ్యే ఈ సమయం ప్రకృతిలో మార్పులు తీసుకురావడమే కాదు, ఈ నెలలో జన్మించిన…
This website uses cookies.