YS Sharmila : షర్మిల పార్టీలో చేరితే నాకు పదివేల కోట్లు ఇస్తుంది… ఆ నేత షాకింగ్ కామెంట్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : షర్మిల పార్టీలో చేరితే నాకు పదివేల కోట్లు ఇస్తుంది… ఆ నేత షాకింగ్ కామెంట్..?

YS Sharmila : వైఎస్ షర్మిల పార్టీ గురించే ప్రస్తుతం తెలంగాణలో చర్చ. షర్మిల పార్టీ పేరు ఇంకా ప్రకటించకున్నా.. పార్టీ విధివిధానాలను ఇంకా ప్రకటించకున్నా చాలామంది నేతలు షర్మిల పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నారు. జులై 8న షర్మిల తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. అప్పుడే వివిధ పార్టీలకు చెందిన కొందరు నేతలు పార్టీలో చేరేందుకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. షర్మిల గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈనేపథ్యంలో వరంగల్ జిల్లాకు చెందిన […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :16 April 2021,9:00 pm

YS Sharmila : వైఎస్ షర్మిల పార్టీ గురించే ప్రస్తుతం తెలంగాణలో చర్చ. షర్మిల పార్టీ పేరు ఇంకా ప్రకటించకున్నా.. పార్టీ విధివిధానాలను ఇంకా ప్రకటించకున్నా చాలామంది నేతలు షర్మిల పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నారు. జులై 8న షర్మిల తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. అప్పుడే వివిధ పార్టీలకు చెందిన కొందరు నేతలు పార్టీలో చేరేందుకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. షర్మిల గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈనేపథ్యంలో వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కొండా మురళి షర్మిల పార్టీపై వ్యాఖ్యానించారు.

congress leader konda murali about ys sharmila

congress leader konda murali about ys sharmila

నేను పార్టీ మారితే షర్మిల పదివేల కోట్లు ఇస్తుంది. నాకు డబ్బు కావాలంటే పార్టీ మారేవాడిని కానీ.. నాకు డబ్బు అవసరం లేదు… నాకు విలువలే ముఖ్యం. షర్మిల పార్టీ నుంచి పిలుపు వచ్చినా… మేం రామని చెప్పా.. నేను వైఎస్ కుటుంబానికి ఎంతో మేలు చేశా కానీ… తర్వాత నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. జగన్ ను జైలు నుంచి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశాను. జగన్ జైలు నుంచి వచ్చాక కనీసం పలకరించలేదు నన్ను. అందుకే మేం పార్టీ మారం. మేము కాంగ్రెస్ లోనే కొనసాగుతాం.. పార్టీకి పునర్వైభవం తీసుకొస్తాం… అని కొండా మురళి స్పష్టం చేశారు.

YS Sharmila : మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలతో మురళి భేటి

త్వరలో వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… షర్మిల పార్టీ గురించి వెల్లడించారు. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి అనే విషయంపై ఆయన ఈ మీటింగ్ లో ప్రసంగించారు. నాకు కరోనా వచ్చి చాలా సమస్యలు అనుభవించా. చావు అంచు వరకు వెళ్లి వచ్చా. అప్పుడు టీఆర్ఎస్ నాయకులు సంబురాలు కూడా చేసుకున్నారు. కానీ… నేను వెనక్కి తగ్గేవాడిని కాదు. మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా ఉండొద్దు. అందరూ నామినేషన్ వేయండి. పార్టీ చెప్పిన వాళ్లందరికీ టికెట్లు ఇస్తాం. టికెట్లు తీసుకొని అమ్ముడు పోకండి. నిజాయితీగా ఉండండి. మీకు మేం ఉంటాం. భరోసా ఇస్తాం… అని కొండా మురళీ స్పష్టం చేశారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది