BJP : త్వరలో సాగర్ ఉపఎన్నిక.. ఈ టైమ్ లో కాంగ్రెస్ కు షాకిచ్చిన బీజేపీ?
BJP : తెలంగాణలో త్వరలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక కోసం ఇప్పటి నుంచే పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ పార్టీ అయితే దూకుడు మీదున్నది. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికలో గెలిచిన ఉత్సాహంతో బీజేపీ దూసుకెళ్తోంది. సాగర్ లోనూ బీజేపీ జెండా ఎగురవేయడానికి తీవ్రంగా శ్రమిస్తోంది.

congress leader ramesh rathod to join in bjp
అందుకే.. సాగర్ లో బీజేపీ నేతలు పాగా వేశారు. సాగర్ లో స్ట్రాంగ్ గా ఉన్న నేతలకు వల వేయడం ప్రారంభించారు. సాగర్ లో ఎక్కువ పోరు టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉండటంతో.. ఆయా పార్టీల్లో ఉన్న నాగార్జునసాగర్ కు చెందిన నేతలను బీజేపీలోకి లాక్కొని… సాగర్ లో గెలవాలన్నది బీజేపీ ప్లాన్.
BJP : సాగర్ లో కీలకమైన ఎస్టీ ఓట్ల కోసం బీజేపీ ప్రణాళికలు
అయితే.. సాగర్ లో ఎస్టీ ఓట్లు కీలకం. ఎస్టీ ఓట్లు ఏ పార్టీకి పడితే ఆ పార్టీ గెలిచే చాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎస్టీ ఓట్లను తమవైపునకు తిప్పుకునేందుకు… కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ ను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
ఆయనకు ఎస్టీ ప్రజలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి.. అందులోనూ ఆయన ఏది చెబితే అదే. అందుకే.. ఎస్టీ ఓట్లను తమవైపునకు తిప్పుకోవాలంటే.. రమేశ్ రాథోడ్ ను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ ప్లాన్ వేసింది.
బీజేపీ నేతలు.. ఇప్పటికే రమేశ్ రాథోడ్ తో పార్టీలో చేరే విషయమై చర్చించారట. ఆయన కూడా పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే.. పార్టీ మార్పు విషయమై తన అనుచరులతో కూడా రమేశ్ రాథోడ్ చర్చించారట. కాకపోతే ఆయన ఎప్పుడు పార్టీలో చేరుతారు అనే విషయం మాత్రం తెలియదు.
రమేశ్ రాథోడ్.. ఎమ్మెల్యే, ఎంపీగా పని చేశారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రమేశ్ రాథోడ్ వల్ల ఎస్టీ ఓటు బ్యాంక్ ను సంపాదించవచ్చు. అందుకే.. రమేశ్ రాథోడ్ కు బీజేపీ గాలం వేసింది. చూద్దాం మరి.. రమేశ్ రాథోడ్.. బీజేపీలో చేరితే సాగర్ ఉపఎన్నికల్లో బీజేపీకి ఏమైనా వర్కవుట్ అవుతుందో? లేదో?