YS Jagan : ఏపీ సీఎంగా జగన్ ఉంటారా?.. 4 నెలలే టైం.. తులసిరెడ్డి సంచలన కామెంట్స్..
YS Jagan : విభజిత ఏపీకి రాజధాని ఏది అనే విషయమై ప్రస్తుతం ప్రజల్లో తీవ్రమైన గందరగోళం ఏర్పడింది. గత ప్రభుత్వం ఏపీకి అమరావతి రాజధాని అని తెలపగా, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశం తెరమీదకు తెచ్చింది. ప్రస్తుతం మూడు రాజధానులను వెనక్కు తీసుకుంది. దాంతో ఏపీకి రాజధాని ఏదనేది ఇంకా తేలని విషయంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇంతకీ రాజధానిగా ఏ నగరాన్ని నిర్మిస్తారు.. సీఎం ఏం చేస్తారు.. అనే విషయాలపై విశేషమైన రాజకీయ అనుభవం గల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
ఏపీ అసెంబ్లీ వేదికగా వైసీపీ ప్రభుత్వం వచ్చే మార్చిలో రాజధానుల బిల్లు తీసుకొస్తామని చెప్పింది. కానీ, అలా బిల్లు తెచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? అని పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మార్చి నెల రావడానికి ఇంకా నాలుగు నెలల టైం ఉందని, ఆ లోపు ఏదైనా జరగొచ్చని కాంగ్రెస్ పార్టీ నేత తులసి మీడియాలో చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇంకా నాలుగు నెలల వరకు మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉంటారా లేదా అనేది ప్రశ్నేనని అన్నారు. దాంతో పాటు ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటారా అని ఆయన అడిగారు.YS Jagan : వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాజధానుల బిల్లు పెట్టేనా?
YS Jagan : వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాజధానుల బిల్లు పెట్టేనా?
జగన్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, పరిపాలనలో చేతగాని తనమే వారిని కూల్చేస్తుందని హెచ్చరించారు. పండుగకు వచ్చే పిట్టల దొరల మాదిరి ప్రభుత్వం ఉత్తర కుమార ప్రగల్బాలకే పరిమితమవుతున్నదని, క్షేత్రస్థాయిలో వారికి అవగాహన లేదని అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే మూడు రాజధానుల బిల్లు కోర్టులో నిలబడుతుందా అని అడిగారు. ఈ క్రమంలోనే అమరావతిలో 9 వేల ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో ఉందని, అలాంటపుడు మళ్లీ బిల్లు ఎందుకని తులసిరెడ్డి ప్రశ్నించారు. తులసిరెడ్డి వ్యాఖ్యలు ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.