AP Congress : రేవంత్ రెడ్డి కంటే తోపు నాయకుడికి పీసీసీ పగ్గాలు.. ఏపీలో కాంగ్రెస్ ఇకనైనా బలోపేతం అవుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP Congress : రేవంత్ రెడ్డి కంటే తోపు నాయకుడికి పీసీసీ పగ్గాలు.. ఏపీలో కాంగ్రెస్ ఇకనైనా బలోపేతం అవుతుందా?

AP Congress : ఆంధ్రప్రదేశ్ లో కుదేలైన కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు ఏఐసీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడి మార్పుతో ప్రక్షాళన ప్రారంభించనుంది. వచ్చే 15 రోజుల్లో ప్రారంభమయ్యే ఈ మార్పుల ప్రక్రియ ఆగస్టు చివరి కల్లా పూర్తి చేయాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టేందుకు ఏఐసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ […]

 Authored By sukanya | The Telugu News | Updated on :30 July 2021,10:30 am

AP Congress : ఆంధ్రప్రదేశ్ లో కుదేలైన కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు ఏఐసీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడి మార్పుతో ప్రక్షాళన ప్రారంభించనుంది. వచ్చే 15 రోజుల్లో ప్రారంభమయ్యే ఈ మార్పుల ప్రక్రియ ఆగస్టు చివరి కల్లా పూర్తి చేయాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టేందుకు ఏఐసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ తరహాలోనే ఫైర్ బ్రాండ్ పీసీసీ ఛీఫ్ ఎంపికతో పాటు పలు కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై పార్టీలోని నేతలకు సంకేతాలు పంపుతున్నారు. త్వరలో రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి ఈ మార్పులు చేపట్టనున్నారని తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై పార్టీలో సీనియర్లతో ముందుగా చర్చించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా సీనియర్లను ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఢిల్లీ రాహుల్ గాంధీతో సమావేశానికి రావాలని వీరిని ఆహ్వానిస్తున్నారు. మరో 15 రోజుల్లో ఈ సమావేశాల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా ప్రతి నేతతో మాట్లాడి కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

congress party planning to get strenthen in andhra pradesh

congress party planning to get strenthen in andhra pradesh

సాకేకు .. ఊస్టింగ్…

ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్ ను మార్చేందుకు అధిష్టానం మొగ్గు చూపుతోంది. శైలజా నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపడం సాధ్యం కాదని భావిస్తున్న హైకమాండ్.. ఆయన స్ధానంలో రేవంత్ రెడ్డి తరహా నేతను ఎంపిక చేయాలని భావిస్తోంది. ఇందుకోసం సీనియర్ల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీని వీడి, మళ్లీ పార్టీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని లీడ్ తీసుకోవాలని అధిష్టానం కోరే అవకాశముంది. ప్రస్తుతం రెడ్ల నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఇందుకు కౌంటర్ గా కిరణ్ ను పీసీసీ ఛీఫ్ చేసేందుకు ఉన్న అవకాశాలపై రాహుల్ దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఏపీ సీనియర్లు ఏమంటారన్నదే కీలకంగా మారింది. ఇక గతంలో పీసీసీ ఛీఫ్ గా పనిచేసిన రఘువీరారెడ్డి .. ఇప్పుడు సైలెంట్ మోడ్ లో ఉన్నారు. తాజాగా మళ్లీ రాజకీయాల్లోకి వస్తారన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. అయితే రఘువీరారెడ్డి.. చూపు వైసీపీవైపు ఉందంటూ గతంలో వార్తలు వెల్లువెత్తాయి. అయితే రఘువీరారెడ్డి మాత్రం పెదవి విప్పడం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం సైలెంట్ లో ఉన్న సీనియర్లు మళ్లీ కదలివస్తారో లేదో మాత్రం వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది