Revanth Reddy : అది రేవంత్ రెడ్డి దెబ్బ అంటే.. దెబ్బకు అందరూ సెట్ రైట్ అయ్యారు?
Revanth Reddy : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం దూకుడు మీదున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉంది రేవంత్ రెడ్డి ఒక్కరే. కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం ఆయన భుజాల మీద మోయాల్సి వస్తోంది. తెలంగాణలో ఎలాగైనా పార్టీని లేపాలని రేవంత్ తెగ ప్రయత్నిస్తున్నారు కానీ.. ఆయనకు సొంత పార్టీ నుంచే మద్దతు లేదు.
రేవంత్ రెడ్డి కొత్తగా పార్టీలోకి వచ్చారు.. ఆయన ఏదో చేద్దామనుకుంటున్నారు.. దశాబ్దాలుగా పార్టీలో ఉన్న సీనియర్ నేతలమైన తమ మాటేమిటి.. ఆయనే అన్నీ చేసేసి క్రెడిట్ కొట్టేస్తే మేమెందుకు అంటూ కొందరు నాయకులు.. రేవంత్ మీద గుస్సా అవుతున్నారు. అది వేరే లెక్క.
అయితే.. తెలంగాణలో రోజురోజుకూ రేవంత్ రెడ్డి హైలెట్ అవుతుండటంతో.. కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా యాక్టివ్ అవ్వాలని డిసైడ్ అయ్యారట. రేపు పొద్దున ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. లేదా ఎక్కువ సీట్లు గెలుచుకున్నా.. ఏదైనా ఎన్నికల్లో గెలిచినా.. ఆ క్రెడిట్ మొత్తం రేవంత్ రెడ్డికే వెళ్లే అవకాశం ఉంది కాబట్టి.. తమ రాజకీయ భవిష్యత్తు కోసం కొందరు నేతలు యాక్టివ్ అయిపోయారు.
Revanth Reddy : రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ నేతల్లో మార్పు
కాంగ్రెస్ నేతల్లో ఇంత మార్పు రావడానికి కారణం రేవంత్ రెడ్డే. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా చేసినా సరే.. పార్టీలో తమ ప్రాధాన్యత ఎక్కడ తగ్గుతుందో అని ఎవ్వరూ టెన్షన్ పడటం లేదు. వాళ్లు కూడా దూకుడుగా ముందుకెళ్తున్నారు. సీఎం కేసీఆర్ పై ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే.. ఇతర నేతలు కూడా విమర్శలు చేయడానికి వెనుకాడటం లేదు. ఇదివరకు.. కేసీఆర్ గురించి మాట్లాడాలంటేనే భయపడే నేతలు.. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ పైనే గురి పెట్టారంటే.. వీళ్లలో ఇంత మార్పును రేవంత్ రెడ్డి ఎలా తెచ్చారని అంతా షాక్ కు గురవుతున్నారు.
అంతే కాదు.. కాంగ్రెస్ కు చెందిన ఇతర ఎంపీలు కూడా అలర్ట్ అయిపోయి.. కేసీఆర్ గురించి కొన్ని సీక్రెట్స్ బయటపెట్టేందుకు రెడీ అవుతున్నారట. అంతే కాదు.. వాళ్ల నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని బట్టబయలు చేసేందుకు కూడా రెడీ అయిపోవడంతో.. కేసీఆర్ కు, ఆయన పార్టీకి.. కాంగ్రెస్ పార్టీ నుంచి బాగానే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.