World Record : 58 గంటల పాటు లిప్ కిస్ పెట్టుకొని ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన జంట.. ఎక్కడో తెలుసా… వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

World Record : 58 గంటల పాటు లిప్ కిస్ పెట్టుకొని ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన జంట.. ఎక్కడో తెలుసా… వీడియో

 Authored By kranthi | The Telugu News | Updated on :30 November 2022,5:40 pm

World Record : ముద్దు అనేది ప్రేమకు చిహ్నం. ఎవరికైనా మనం ముద్దు ఇచ్చామంటే వాళ్ల మీద మనకున్న ప్రేమను తెలియజేయడం. అయితే ముద్దులో చాలా రకాలు ఉంటాయి. పిల్లలకు బుగ్గ మీద ఇచ్చే ముద్దు వేరు. పెద్దవాళ్లకు ప్రేమతో ఇచ్చే ముద్దు వేరు. పార్టనర్ లకు, భార్యకు, భర్తకు పెదవుల మీద ఇచ్చే ముద్దు వేరు. సాధారణంగా ఎవరైనా సరే కొన్ని సెకన్ల పాటు మాత్రమే ముద్దు పెట్టుకుంటారు. అంతే కానీ.. గంటలకు గంటలు ఎవ్వరూ ముద్దు పెట్టుకోరు కదా. కొన్ని జంటలు ఏకాంతంగా ఉన్న సమయంలో ముద్దు పెట్టుకుంటూ ఉంటారు.

కానీ.. అది కొంత సేపు మాత్రమే. కానీ.. ఓ జంట మాత్రం ఏకంగా 58 గంటల పాటు ముద్దు పెట్టుకుంది. 58 గంటల పాటు ఏకధాటిగా ముద్దు పెట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. కానీ.. దాన్ని సుసాధ్యం చేసింది ఆ జంట. అంతే కాదు.. ప్రపంచ రికార్డును కూడా ఆ జంట నెలకొల్పింది. ఈ ఘటన థాయిలాండ్ లోని పట్టాయాలో చోటు చేసుకుంది. ఈ పోటీ ప్రకారం.. ఒక్కసారి ఇద్దరి పెదాలు కలిశాక.. మళ్లీ వాటిని తీయకూడదు. కంటిన్యూగా ఎవరు ఎక్కువ సేపు లిప్ టు లిఫ్ కిస్ పెట్టుకుంటే వాళ్లే విజేతలు అన్నమాట.

couple wins award in 58 hours worlds lp ks

couple wins award in 58 hours worlds lp ks

World Record : గెలిచిన వారికి 3 వేల డాలర్లతో పాటు రెండు డైమండ్ రింగ్స్ బహుమతి

అయితే.. కచాయ్, లక్సన అనే జంట 58 గంటల పాటు ఏకధాటిగా ముద్దు పెట్టుకొని రికార్డు క్రియేట్ చేశారు. చాలా జంటలు ఈ పోటీల్లో పాల్గొన్నప్పటికీ.. చాలామంది మధ్యలోనే తమ వల్ల కాదని వెళ్లిపోయారు. కానీ.. ఒక్క కచాయ్, లక్సన జంట మాత్రమే 58 గంటల పాటు ముద్దు పెట్టుకొని ప్రపంచ రికార్డును క్రియేట్ చేశారు. ఆ జంట ముద్దును గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఇది 2013 లో జరిగిన పోటీ. కానీ.. ఆ వీడియో తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది