Government Duties : ప్రభుత్వ విధుల్లో కోర్టుల జోక్యం గురించి ఈయన అద్భుతంగా చెప్పాడు..!
Government Duties : అది ఏ రాష్ట్రమైనా అక్కడి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల బాధలను పట్టించుకోవాలి. ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి. ప్రాథమిక అవసరాలు తీర్చాలి. అదే ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం, ప్రజల మధ్య కోర్టులు దూరకూడదు. కోర్టులు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు.. అని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. న్యాయవ్యవస్థకు ఒక పరిధి ఉంటుంది. ప్రతి విషయానికి న్యాయవ్యవస్థ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అవసరం ఉంటేనే న్యాయస్థానాలు స్పందించాలి.
కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ సంబంధం లేని, సాధ్యం కాని పనులపై కూడా తప్పుడు తీర్పులు వస్తున్నాయన్నారు.ప్రజాస్వామ్యం అన్నింటికంటే ఉన్నతమైనది. దానికి విఘాతం కలిగించకూడదు. ఒకవేళ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగితే అప్పుడు న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించే అధికారం ఉంటుంది. కానీ.. పాలన వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై మాత్రం ఉన్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు. దాని వల్ల ప్రభుత్వాలు మంచి పాలన అందించలేవు. పాలకులు కూడా ప్రతి విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి.
Government Duties : సామాన్యుడికి, కార్యనిర్వాహక వర్గానికి మధ్య న్యాయవ్యవస్థ వారధి
సామాన్యుడికి, కార్యనిర్వాహక వర్గానికి మధ్య న్యాయవ్యవస్థ ఒక వారధిలా ఉండాలని, పాలకులు కూడా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అవసరమైనప్పుడే కోర్టులు స్పందించాలని, మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత ప్రభుత్వాలదే అని, సంబంధం లేని, సాధ్యం కాని పనులపై కూడా తప్పుడు తీర్పులు వస్తున్నాయని, కార్యనిర్వాహకవర్గంపై కొన్ని తీర్పులు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, సుపరిపాలన అందిస్తేనే ప్రభుత్వ పనితీరుకు గీటురాయి అని స్పష్టం చేశారు.