Bandi Sanjay : టెన్త్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో A1గా బండి సంజయ్.. నిజాలు బయటపెట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్.. వీడియో
Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నీ పోలీసులు ఈరోజు ఉదయం అరెస్టు చేయటం తెలిసిందే. తెలంగాణ పదవ తరగతి విద్యార్థుల పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో అరెస్ట్ కావటం జరిగింది. అయితే ఈ అంశంపై వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ… పదవ తరగతి హింది ప్రశ్న పత్రం ప్రశాంత్ అనే వ్యక్తి వైరల్ చేశారని స్పష్టం చేశారు. బండి సంజయ్ కు ఆ పేపర్ ను 11:24 గంటలకు పంపినట్లు పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు కూడా ఉదయం 10:41కి పేపర్ పంపించినట్లు స్పష్టం చేశారు.
హిందీ పరీక్షకు ముందు రోజే బండి సంజయ్ మరియు ప్రశాంత్ ఫోన్ లో చాటింగ్ చేసుకున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ ప్రకారం ఈ పదవ తరగతి పేపర్ లీక్ కుట్ర జరిగిందని పేర్కొన్నారు. కమలాపూర్ పాఠశాల నుండి పేపర్ బయటికి వచ్చిందని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీలో చాలామందికి షేర్ కూడా చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఉదయం 9:30 గంటలకే పేపర్ లీక్ అయినట్టు ప్రశాంత్ తప్పుడు సమాచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కేసులో ఎవరిని అనవసరంగా
ఇరిక్కించాలనే ఉద్దేశం పోలీసులకు లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. బండి సంజయ్ అరెస్ట్ కి సంబంధించి సమాచారాన్ని లోక్ సభ స్పీకర్ కు ఇచ్చామని వెల్లడించారు. బండి సంజయ్ మరియు ప్రశాంత్ మధ్య జరిగిన సంభాషణే ఈ కేసులో కీలకమని చెప్పుకొచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరింత మంది సాక్షులను విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రశాంత్ పేపర్ లీక్ చేసిన వెంటనే బండి సంజయ్ మీడియా సమావేశం పెట్టారని… దురుద్దేశంతోనే ఈ పని స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు వరంగల్ కమిషనర్ మీడియా సమావేశంలో తెలిపారు.