Crime News : భర్త, కుమారుడిని కట్టేసి.. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ స్నేహితులు..!
Crime News : ఒడిశాలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. జయపురం స్థానిక సమితిలో.. ఓ మహిళపై తన భర్త, కుమారుడు చూస్తూ ఉండగానే పలువురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుములిపుట్ గ్రామానికి చెందిన మీణా హరిజన్, అతని స్నేహితులు అదే గ్రామానికి చెందిన ఓ మహిళపై కన్నేశారు. పక్కా ప్రణాళికతో ఆమె ఇంట్లోకి వెళ్లి…
తన భర్తను, కుమారుడిని కట్టేసి ఆమెపై అత్యాచారం చేసి.. బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడినుంచి పారిపోయారు. ఈ ఘటనలో సదరు వ్యక్తి తన తన భార్యతో పోలీసులను భర్త ఆశ్రయించాడు. బాధితుల వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మీణా హరిజన్ ను అరెస్ట్ చేశారు. పరారైనా మిగతా కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Crime News A group of friends Mass raped a married women in front of her family in odisha
ఆ కామాంధులకు కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ప్రతి నిమిషానికి ఏదో చోట మహిళలపై అఘాయిత్యాలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన ఇది మాత్రం ఆగడం లేదని చెప్పవచ్చు. ఏది ఏమైనా ప్రభుత్వం ఇంకా కఠిన చట్టాలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.