Crime News : పెళ్ళాం ఫ్రెండ్ ని చంపేసాడు .. ఎందుకు రా అంటే కారణం చూడండి !
Crime News : ప్రస్తుత రోజుల్లో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. కుటుంబ వ్యవస్థ చాలా ప్రమాదకరంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు సైతం అక్రమ సంబంధాలకు పాల్పడి ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకుంటున్నారు. దీంతో పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. ఇదిలా ఉంటే ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో భార్య స్నేహితుడు ఎగస్ట్రాలు చేస్తున్నాడని… ప్రాణం తీసేసాడు భర్త. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2003వ సంవత్సరంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఓ వ్యక్తిని హత్య చేయడం జరిగింది. తన భార్యతో చనువుగా ఉంటున్నాడని ఆమె స్నేహితుడిని భర్త హత్య చేశాడు. తరువాత అతడిని అడవిలో పాతి పెట్టడం జరిగింది. అయితే పార్టీ పెట్టిన తర్వాత గత 20 సంవత్సరాలు నుండి…
హత్య చేయబడిన వ్యక్తి… హత్య చేసిన వ్యక్తి కలలోకి వచ్చి వేధిస్తూ ఉండటం జరిగింది. దీంతో ఈ వేదన తట్టుకోలేక హత్య చేసిన వ్యక్తి మొత్తం విషయాన్ని గ్రామస్తులకు పోలీసులకు తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో బాలోద్ లోని కరక్ భాట్లో కొలియారా అనే వ్యక్తి తన భార్య స్నేహితుడ్ని కర్ భాట్ కు చెందిన టికం2003లో .. హత్య చేయటం జరిగింది. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతడ్ని చంపేశానని.. తాజాగా గ్రామస్తులతో తర్వాత పోలీసులతో చెప్పటం జరిగింది. హత్య చేసిన తర్వాత అతడు రోజు తన కలలోకి వచ్చి వేధిస్తున్నాడని..
చెప్పటంతో దీంతో అతడి మాటలకు గ్రామస్థులు హడలిపోతున్నారు. తన భార్య స్నేహితు డైన గోయల్ ను చంపేసి అడవిలో పాతిపెట్టినట్లు చెప్పాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు… అతడు చెప్పిన ప్రదేశంలో తవ్వకాలు చేపట్టగా అక్కడ కొన్ని ఎముకలు.. పాత దుస్తులు కనిపించాయి. దీంతో.. పోలీసులు ఒక్కసారి అలెర్టు అయ్యారు.మరోవైపు గోయల్ కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాడన్న విషయాన్ని గ్రామస్థులు సైతం ధ్రువీకరించటతో పోలీసులు తమ వేటను మరింత పెంచారు.తాము సేకరించిన ఎముకలు.. బట్టల్ని డీఎన్ ఏ పరీక్ష కోసం ల్యాబ్ కు పంపారు.ఇప్పుడు నిందితుడి మాటల్ని పరిగణలోకి తీసుకొని విచారణను ముమ్మరం చేశారు.