Cucumber Juice : కీరదోస జ్యూస్ తో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cucumber Juice : కీరదోస జ్యూస్ తో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు…!

 Authored By jyothi | The Telugu News | Updated on :23 December 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Cucumber Juice : కీరదోస జ్యూస్ తో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు...!

Cucumber Juice  : ఇప్పటి రోజుల్లో దాదాపు అందరూ ఎదుర్కొంటున్న సమస్య పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు. శరీరంలో పేరుకుపోవడం వలన అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నబరువు తగ్గించుకోవాలన్నా మనం తీసుకునే ఆహారంలో మార్పు. ఎంతైనాఅవసరం.బరువు తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికి అనివార్యంగా మారింది.చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అనేకమందిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో గుండె సంబంధ వ్యాధులు హై బీపీ, డయాబెటిస్ వస్తున్నాయి. అలాంటివారు నిత్యం వ్యాయామం చేయాలి. దాంతోపాటు కింద చెప్పిన విధంగా రోజు తీసుకోవాలి. దీంతో అధిక బరువు బాణపొట్ట సమస్యలు రెండేటి నుంచి విముక్తి లభిస్తుంది.

ఈ కీరదోస జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కీర దోసకాయ తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి. ఆ ముక్కల్లో ఒక నిమ్మకాయను పూర్తిగా రసం పిండాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం, రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జ్యూస్, ఒక కప్పు నీటిలో ఆ మిశ్రమం వేయాలి. అనంతరం అన్నిటిని మిక్సీ పడితే జ్యూస్ తయారైనట్టే దీన్ని రోజు తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేంటంటే.. కీరదోస జ్యూస్ ను రోజు తాగడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.

బాన పొట్ట కరిగిపోతుంది. శరీరంలో ఉండే విష పదార్థాలు బయటికి వెళ్లిపోయి శరీరం శుభ్రంగా మారుతుంది. శరీరంలో అతిగా ఉండే నీరు తొలగిపోతుంది. సాధారణమైన కీరాలో సాధారణ గుణాలు ఉన్నాయి. కీరా లో శరీరానికి కావాల్సిన అనేక విటమిన్లు ఉన్నాయి. ఈ కీరాలో మెగ్నీషియం, సిలికాన్ తో పాటు ఇంకా అనేక పోషక పదార్థాలు ఉన్నాయి. ఈ పోషకాలు ఉండటం వల్ల శరీరం అనారోగ్యాల బారిన పడకుండా ఉంటుంది. మనకు రక్షణ కలుగుతుంది. ప్రతిరోజు కొన్ని కీర ముక్కల్ని తినడం వలన బరువు తగ్గుతారు. శరీరంలోని మలినాలు కూడా తొలగిపోతాయి…

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది